వైరల్: వాడికి భూమ్మీద నూకలు వున్నాయి.. సముద్రంలో మునిగిపోతున్న వాడిని డ్రోన్ కాపాడింది!

మనకి కొన్ని సార్లు రకరకాల సామెతలు వినబడుతూ ఉంటాయి. అందులో “భూమ్మీద నూకలు వున్నాయి” అనేది ముఖ్యంగా వినబడుతుంది. దీనిని ఎవరన్నా అలా ప్రమాదంనుండి బయటపడినపుడు బేసిగ్గా వాడుతారు. ఇక అలాంటి సంఘటనలు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా మనుషులకు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి సంఘటనలు అంటే.. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటివి చోటుచేసుకున్నా మనకు ఇట్టే తెలిసిపోతుంది. సరిగ్గా అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే, స్పెయిన్‌లోని వాలెన్సియాలో స‌ముద్రంలో మునిగిపోతున్న 14 ఏళ్ల బాలుడి ప్రాణాలను డ్రోన్ లైఫ్‌గార్డ్ సురక్షితంగా ఒడ్డుకి చేర్చింది. బీచ్‌లో బ‌లంగా వ‌స్తున్న అలల్లో చిక్కుకుపోయి ఆ అబ్బాయి కొట్టుమిట్టాడుతుండగా ఈ డ్రోన్ ఓ దేవుడిలాగా అక్కడ ప్రత్యక్షమైంది. దాంతో అతగాడు బయటపడ్డాడు. లేదంటే నూకలు చెల్ళేయే. బ‌య‌ట‌కి రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న బాలుడికి డ్రోన్ ద్వారా లైఫ్‌జాకెట్ అందించ‌గా, దాని సహాయంతో లైఫ్‌గార్డ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వాడిని రక్షించారు.

మనదగ్గర తక్కువగానే, ఫారిన్ కంట్రీలలో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అందువలన ఇలాంటి జాగ్రత్తలు వారు తీసుకుంటారు. డ్రోన్లు వ‌చ్చిన త‌ర్వాత మాన‌వాళికి చాలా విష‌యాలు సుల‌భ‌మ‌య్యాయి. ముఖ్యంగా, ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌తా కార్య‌క‌లాపాల్లో డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వాలెన్సియాకు ఉత్తరాన ఉన్న సగుంటో అనే న‌గ‌రంలో స్పానిష్ లైఫ్‌గార్డ్ సిబ్బందితో క‌లిసి జనరల్ డ్రోన్స్ వాలెన్సియా ఆధారిత కంపెనీ ప‌నిచేయ‌డం ప్రారంభించిన త‌ర్వాత ఇప్పుడ‌ది స్పెయిన్ అంతటా 22 బీచ్‌లలో లైఫ్‌గార్డ్‌లతో కలిసి 30కి పైగా పైలట్‌లతో డ్రోన్‌లను వర్క్ చేయడానికి ఉంచింది.