ఆ సినిమా వదులుకొని అల్లు అర్జున్ మంచి పని చేశాడా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం పుష్ప సీక్వెల్ తో మరో రికార్డు సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ముఖ్యంగా పుష్ప ది రైస్ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ అక్కడ తన మార్కెట్ ను బాగా పెంచుకున్నాడు అందుకే బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్న ఈయన పాన్ ఇండియా రేంజ్ లో రావడానికి చాలా ముందుగానే ఇతర ఇండస్ట్రీలలో సత్తా చాటడానికి ప్లాన్ చేసుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే మలయాళం ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం.Allu Arjun on Working in Bollywood: 'Hindi Is Out of My Comfort Zone But...'

ఈ క్రమంలోనే మలయాళం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అందరూ మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు. దీన్ని బట్టి చూస్తే అతడిని మలయాళం ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎంతగా ఓన్ చేసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఈయనకు మంచి ఆదరణ లభించింది. కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి అల్లు అర్జున్ ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. ఎంతోమంది తమిళ్ దర్శకులతో సంప్రదింపులు జరిపిన తర్వాత చివరికి ఎన్ లింగు స్వామి చేతుల మీదుగా కోలీవుడ్లో లాంచ్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. DJ సినిమా ప్రారంభించినప్పుడు షూటింగ్ సమయం మొదలుపెట్టిన కొన్ని రోజులకే లింగు స్వామి దర్శకత్వంలో తమిళ్ , తెలుగు బైలింగ్వల్ మూవీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక తర్వాత అల్లు అర్జున్ తమిళ్ డబ్బింగ్ నిర్మాణ బాధ్యతలను స్టూడియో గ్రీన్ సంస్థ తీసుకుంది.

ఈ సినిమాను 2016 సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు బన్నీ ట్వీట్ కూడా చేశాడు. సినిమా ప్రాజెక్టు ఇంకా లాంచ్ చేయకుండానే అటకెక్కిందని చెప్పవచ్చు. ఆర్థిక సమస్యలు , క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా ఆగిపోయింది. సినిమా తర్వాత తెలుగులోనే తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఇక అలవైకుంఠపురంలో, పుష్ప లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాడు. బైలింగ్వల్ సినిమాలు మన హీరోలకు సెట్ కాలేదని చెప్పాలి .ఇటీవల రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా పరవాలేదు అనిపించుకున్నా..పెద్దగా కలెక్షన్లపై ప్రభావం చూపలేకపోయింది. దీంతో అల్లు అర్జున్ బైలింగ్వల్ సినిమాను వదులుకోవడమే మంచి పని అయిందంటూ ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.