ఆ విషయంలో చిరంజీవి అంటే నచ్చదు అంటున్న సురేఖ..!!

ఏ ఒక్కరైనా సరే తమ జీవితంలో వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అన్ని విషయాలలో ప్రతి ఒక్కరికి నచ్చాలని చేయరు కదా.. ఇక ఇతరుల కోసం మనం జీవిస్తే.. మనకోసం మనం ఏం చేసుకున్నాం అనే ప్రశ్న కూడా మనకు ఎదురవుతుంది. ఇక ప్రతి ఒక్కరికి నచ్చే మనం బ్రతకాలి అంటే అది అసాధ్యమైన పని. ఇక ఎవరికి నచ్చినట్టుగా వారి జీవిస్తేనే వారి జీవితంలో సంతోషం వెతుక్కోగలరు అని.. ఇటీవల ఎంతోమంది అనుభవజ్ఞులు కూడా తెలియజేశారు ఇకపోతే ఇదే క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి విషయంలో కూడా ఒక విషయం ఆయన భార్య సురేఖకు అస్సలు నచ్చదట. ఇక సురేఖ ఎందుకు అలా అనాల్సి వచ్చిందో మనం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.Chiru and Surekha Wedding Anniversary - YouTube

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ ఎన్నో వైవిద్య భరితమైన చిత్రాలలో నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు.ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలతో సమానంగా దూసుకుపోతూ వరుస ప్రాజెక్టులకు కమిట్మెంట్ ఇస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటున్న ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయంకృషితో నేడు టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్లారు అంటే ఇక ఆయన ఫలితం వెనుక ఎంత కష్టం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.Makar Sankranti 2020: 'Priceless Moments' From Chiranjeevi, Ram Charan's  Fam-Jam

ఇక వ్యక్తిగత విషయంలో కూడా చిరంజీవి – సురేఖ దంపతులు ఎంతోమందికి ఆదర్శ దంపతులుగా నిలిచారు. ఇక చిరంజీవి కూడా నిత్యం తన కుటుంబం కోసం అలాగే పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూనే మరొకవైపు సమాజసేవ కోసం తనవంతు కృషి చేస్తున్నారు. అన్ని విషయాలలో జెంటిల్మెన్ గా వ్యవహరించే మెగాస్టార్.. పట్ల ఆయన భార్య సురేఖ ఒక విషయంలో ఎంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. చిరంజీవి ఒక పని రాక్షసుడు అని ఆమె తెలిపారు. పని ధ్యాసలో పడి సరైన సమయానికి భోజనం కూడా చేయారని, ఆ విషయంలో తనకు ఏ మాత్రం చిరంజీవి నచ్చరని సురేఖ పలు సందర్భాలలో వెల్లడించారు. ఇకపోతే షూటింగ్ సమయంలో ఎలాగో సరైన సమయానికి భోజనం చేయరు.. కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా సరైన సమయానికి భోజనం చేస్తే ఏమవుతుంది అంటూ ఆమె తన భర్తను మరొకసారి ప్రశ్నించారు..Chiranjeevi: Chiru's wife Surekha who looks after her daughters like her  own children .. Rakhi Gift gives assets worth crores | megastar Chiranjeevi  worth crores of land in Kokapeta as a gift

ఇక సరైన సమయానికి భోజనం చేయకపోతే అతడి ఆరోగ్యం ఏమవుతుందో అనే ఆందోళన తనకు ఎక్కువగా ఉంది అని.. ఈ ఒక్క విషయం తప్ప అన్ని విషయాలలో చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు అని తెలిపారు.