హీరోల పారితోషకం పై నిర్మాతలకు గట్టి కౌంటర్ ఇచ్చిన బండ్లన్న..!!

ఈ మధ్యకాలంలో తరచూ వివాదాలకు తెర తీస్తూ తనకు సంబంధం లేని విషయాలలో కూడా తల దూరుస్తూ ఎప్పటికప్పుడు వివాదాలను సృష్టిస్తున్న ప్రముఖ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలాగే హీరోగా ఇప్పుడు ఇప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న బండ్ల గణేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ .. ఇటీవల పవన్ కళ్యాణ్ ని కూడా టార్గెట్ చేస్తూ మాటలు మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ రిలీజ్ సమయంలో తాత ముత్తాతలు గురించి మాట్లాడటంతో.. రామ్ చరణ్, మహేష్ బాబు , ఎన్టీఆర్ లాంటి వాళ్ళ పేర్లు ప్రస్తావించి వాళ్ళే గొప్పనటులు అన్నట్టుగా మాట్లాడి అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ కించపరిచినట్టు మాటలు మాట్లాడడంతో అందరూ కూడా ఈయనపై కామెంట్స్ చేయడమే కాకుండా రకరకాల ట్రోల్స్ కూడా చేశారు.

ఇక ఒక వివాదం సద్దు మనిగే లోపే ఇంకొక వివాదానికి తెర లేపాడని చెప్పవచ్చు. ఇక తాజాగా కరోనా వచ్చిన తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలు కూడా పారితోషకం పెంచుతున్న నేపథ్యంలో నిర్మాతలకు పెనుబారంగా మారింది. ఇక ఈ క్రమంలోని ఆగస్టు ఒకటవ తేదీ నుంచి నిర్మాతల బంధ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు తమ పారితోషకం తగ్గించుకుంటామని చెప్పి దిగివచ్చిన విషయం అందరికీ తెలిసిందే . కానీ ఈ విషయంపై బండ్లన్న విపరీతంగా నిర్మాతలపై ఫైర్ అవుతున్నట్లు సమాచారం.

అంతేకాదు బండ్ల గణేష్ ప్రస్తావిస్తూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిరుపయోగమైన వ్యవస్థ . ముఖ్యంగా సినిమాలు రాని వాళ్లు కూడా ఈ గిల్డ్ లో ఉంటున్నారు. ఇక ఇండస్ట్రీకి ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ , ఒక ఫిలిం ఛాంబర్ ఉన్నాయి. దానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి. ఇక హీరోల పారితోషకాల విషయంపై టికెట్ ధరల పెంపు అంశంపై కూడా నిర్మాత అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అని కూడా తెలిపారు. ముఖ్యంగా ఏ హీరోని ఏ డైరెక్టర్ ను పారితోషకం తగ్గించుకోమనే హక్కు ఏ నిర్మాతకు లేదు అని.. కాల్ షీట్ లకు , సీట్లకు తేడా తెలియని వాళ్ళు , షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు ప్యాకప్ అవుతుందో తెలియని వాళ్లు కూడా సినిమాలు నిర్మిస్తున్నారు అని కామెంట్లు చేశారు.