ప్రొడ్యూసర్స్ కి బాగా లాభాలు తీసుకచ్చిన టాప్ 5 చిత్రాలు ఇవే !

తెలుగు ఇండస్ట్రీ లో రీసెంట్ గా విడుదల అయ్యి ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాల లిస్ట్ ఇదే.. ఏ సినిమా అయినా… అది అమ్ముడు పోయిన రేటు కంటే కూడా ఎక్కువగా వసూళ్లు సాధించిన వాటినే ఇండస్ట్రీ లో హిట్ సినీమాగా పరిగణిస్తారు. మరి ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో సహా తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల విషయానికి వచ్చినట్లయితే…

రీసెంట్ గా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన RRR సినిమాతో మరోసారి ఇండస్ట్రీ లో రికార్డుల వేట గురించి చర్చ మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ రోజు అత్యధిక వసూళ్లను సాధించి పెట్టిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాదు.. రూ. 100 కోట్ల షేర్ లాభాలను కూడా తీసుకొచ్చి పెట్టింది. మరి ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ తో సహా తెలుగు ఇండస్ట్రీ లో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన టాప్ సినిమాల విషయానికి వచ్చినట్లయితే..

1.బాహుబలి 2 సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కింది.ఇందులో ప్రభాస్ హీరోగా చేశారు.అయితే ఈ ‘బాహుబలి’ సినిమా ఇటు తెలుగు ఇండ్ట్రీతో పాటు అటు ప్యాన్ ఇండియా లెవల్లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సాధించింది. అప్పట్లో బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 195 కోట్ల బిజినెస్ చేస్తే.. దానికి గాను రూ. 352 కోట్ల షేర్ లాభాలు భాహుబలి కాతాలో చేరాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 360 కోట్ల బిజినెస్ చేస్తే.. 860 కోట్లు లాభాలు సాధించింది ‘బాహుబలి’. మొత్తంగా చెప్పినట్లయుతే ఈ సినిమా రూ. 508 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 860 కోట్ల షేర్ సంపాదించింది.

2017లో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బాహుబలి 2’. ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో అలాగే భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించిన రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సినిమా దాదాపుగా రూ 1800 కోట్ల గ్రాస్ వసూళ్లను సంపాదించింది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా రూ. 325 కోట్ల షేర్ సాధించింది. మిగిలిన అన్ని భాషల్లో కలిపి రూ. 831 కోట్ల షేర్ సాధించి 2017 హైయ్యెస్ట్ గ్రాసర్‌ సాదించిన సినిమాగా నిలిచింది.

2. 2015 – బాహుబలి సినిమా:- ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్‌లో తీసిన బాహుబలి ది బిగినింగ్ సినిమా కూడా దాదాపు రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను అన్ని భాషల్లో కలిసి సాధించింది.అయితే తెలుగులో మాత్రం రూ. 191 కోట్ల షేర్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి చూసినట్లయితే ఓవరాల్‌గా రూ. 311 కోట్ల షేర్ సాధించి రూ. 186 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.అయితే రెండు భాగాలు కలిపితే లెక్కించినట్లయుతే.. రూ. 694 కోట్ల షేర్ ను నిర్మాతలకు లాభాలగా తిసుకొచ్చిపెట్టింది.

3.RRR | అన్ని ఏరియాల్లో కలిపి RRR సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. అయితే ఈ సినిమా విడులయిన అన్ని ఏరియాల్లో 16 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 111.41 కోట్ల లాభాలతో సూపర్ హిట్ స్టేటస్ ను అందుకుంది. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా విదులయిన తొలి రోజే అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan) లాంటి అగ్ర హీరోలు కలిసి నటించిన RRR సినిమా బాక్సాఫీస్ దగ్గర రోజు రోజుకి ఒక్కో రికార్డును బద్దలు కొడుతూ వెళుతోంది. కాగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 111 కోట్ల లాభాలతో మూడో స్థానంలో నిలిచింది.

4.అల వైకుంఠపురములో ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా రూ. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే ఓవరాల్‌గా ఈ సినిమా 160.37 కోట్లతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే మొత్తంగా 2020లో విడుదలయిన అన్ని సినమాలలో ఈ సినిమానే హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది .

5.గీత గోవిందం: | అల్లు అర్జున్ మొదట అర్జున్ రెడ్డి సినిమాను రిజెక్ట్ చేసి విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండకు ఇంత సూపర్ స్టార్ క్రేజ్ దక్కడంలో అల్లు అర్జున్ పాత్ర చాలానే ఉంది.అటు తర్వాత గీత గోవిందం కథను కూడా కాదు అనుకున్నాడు. సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉండడంతో అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ ఈ సినిమాకు అడ్డుగా కనిపించింది. అందుకే ఈ సినిమాను కూడా బన్నీ చేయలేకపోయాడు . మరి ఇదే సినిమాను విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించి అరుదయిన ఘన విజయం సాధించాడు దర్శకుడు పరశురామ్. మరి ఈ సినిమా రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రూ. 70 కోట్ల షేర్‌తో పాటు రూ. 55.43 కోట్ల లాభాలను లాభాలను తీసుకొచ్చింది.

6.F2 | అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎఫ్ 2’.ఈ సినిమా లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు.మరి ఈ సినిమా రూ. 34.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, రూ. 80 కోట్ల షేర్ వరకు సాధించింది. ఈ సినిమా కూడా రూ. 50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

7. రంగస్థలం: రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘రంగస్థలం’.ఈ సినిమా కూడా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని సాధించింది. మరి ఈ సినిమా విడుదలయిన మొదటి వారంలోనే ఏపీ లో : రూ. 58.98 కోట్లు షేర్ సాధించింది. అయితే ఓవరాల్‌గా రూ. 122.37 కోట్ల వసూళ్లు సాధించింది. 2018లో విడులయిన సినిమాల్లోకెల్లా హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచి ఓవరాల్‌గా రూ. 47.52 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

8. ‘పుష్ప’ | రీసెంట్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’ .ఈ సినిమా లో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఒక్క ఏపీలో తప్ప మిగతా అన్ని ఏరియాల్లోని డిస్ట్రిబ్యూటర్స్‌కు అలాగే నిర్మాతలకు అత్యధిక లాభాలను తీసుకొచ్చింది. రూ. 144 .9 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన ఈ సినిమా విడులయిన 6 వారాల్లోనే రూ. 177.16 కోట్ల షేర్ వచ్చింది. మరి మొత్తంగా ఈ సినిమా రూ. 39.72 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

9.సరిలేరు నీకెవ్వరు | అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు ‘.ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించారు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదలైంది. మరి ఈ సినిమా రూ. 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి.. రూ. 139 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 39.36 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

10. సోగ్గాడే చిన్నినాయనా: సోగ్గాడే చిన్నినాయనా సినిమా విడులయిన మొదటి రోజు వచ్చిన టాక్‌కు.. అది తీసుకొచ్చిన వసూళ్లకు ఎక్కడా అసల పొంతనే సరిపోలేదు. నాగార్జున లాంటి సూపర్ సీనియర్ హీరో ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులతో.. ఆ చాటుమాటు యవ్వారాల తో సినిమా చేయటం ఏంటి అంటూ విమర్శలు చాలానే వచ్చాయి. కానీ చివరికి చూసినట్లయితే అదే సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది.మరి ఈ సినిమా రూ. 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి దాదాపు రూ. 50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

11. ఉప్పెన : మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా ,సాయి ధరమ్ తేజ్ తమ్ముడు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో మన ‘వైష్ణవ్ తేజ్’.. ఈయన తొలి సినిమా ఉప్పెనతో సంచలనం సృష్టించాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా రూ. 51 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మొత్తంగా తొలి సినిమాతోనే ‘ఉప్పెన ‘ మూవీ ఇండస్ట్రలోనే సంచలనం సృష్టించింది. ఈ సినిమా రూ. 20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే .. రూ. 31.02 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. అంతేకాదు ఈ సంవత్సరం నిర్మాతకి అత్యధిక లాభాలు తీసుకొచ్చిన రెండవ సినిమాగా నిలిచింది. ఒక రకంగా చెప్పాలినంటే పెట్టిన పెట్టుబడికి అలాగే దానికి వచ్చిన లాభాలను సరి చూసుకున్నట్లయితే.. ఎక్కువ ప్రాఫిట్ సాదించిన సినిమాగా నిలిచింది.