పిట్ట గోడపై క్యాట్ వాక్‌ చేస్తూ మృతిచెందిన‌ తెలుగు హీరోయిన్ గురించి మీకు తెలుసా ?

సినిమా ఇండస్ట్రీ అనగానే ఎందరో వస్తుంటారు పోతుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అలాంటి వారు ఒక మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు కన్నడ, తమిళ, మళయాళం ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీలోనూ ఉంటారు. అటువంటి వారిలో ఒకరే మన ఈ నివేదిత జైన్. ఈమె 90వ దశకంలో కన్నడలో అడుగు పెట్టిన అందాల రాశి. అయితే అడుగు పెట్టిన అనతి కాలంలోనే తనకి ఉన్న అందం వలన అలాగే తన నటన వలన స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయారు. ఈమె నార్త్ ఇండియన్ అయినా కూడా కర్ణాటకలో కండక్ట్ చేసిన ఒక బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొని మిస్ బెంగళూరు గా ఎంపికయ్యారు.

ఆ క్రేజ్ వలనే నివేదితకు కన్నడలో “శివరంజని” అనే సినిమాలో అవకాశం లభించింది. ఆ సినిమా గొప్ప విజయం సాధించింది. దీనితో నివేదితకు కన్నడలోని టాప్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది. అలా హీరోల అందరితో ఆడిపాడుతూ తానూ కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ ని చేరుకుంది. ఇక కన్నడలో ఇలా వరుస సినిమాలు చేస్తూ, టాలీవుడ్ లో నరేష్ పక్కన హీరోయిన్ గా కోన వెంకట్ నిర్మించిన మొదటి సినిమా అయిన “తోక లేని పిట్ట” సినిమాలో నటించారు. ఈ సినిమాకు ప్రముఖ కమెడియన్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వం చేసారు. కానీ అది ఫ్లాప్ అయింది.

కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన నివేదితకు తెలుగులో మంచి గుర్తింపును తీసుకువచ్చిది. తెలుగులో నివేదితకు ఆమాంతం క్రేజ్ పెరిగిపోయింది. కానీ మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకోటి తలిచినట్లు అనుకున్నవేవీ జరగలేదు. దానికి తోడు 1998లో పెట్టిన బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొనడానికి నివేదిత 35 అడుగుల ఎత్తు ఉన్న గోడపై నుంచి క్యాట్ వాక్ చేస్తూ కాలు స్లిప్ అయ్యి తృటిలో జారి కింద పడిపోయారు. దీనితో ఆమె తలకి బలమైన గాయం తగిలి దాదాపు 20 రోజులపాటు కోమాలో ఉండి పోయింది. డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. చివరికి తన ప్రాణాన్ని విడిచి అనంత కాలగర్భంలో కలిసిపోయింది.

అయితే డాక్టర్స్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించటంతో ప్రజల్లో ఒక్కసారిగా తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మరి కొందరు అయితే ఆమె ఈ బ్యూటీ కాంపిటీషన్ లో పాల్గొనడం ఇష్టంలేకపోవడం వల్ల‌ వాళ్ళ అమ్మనే మేడ మీద నుంచి తోసేసి ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఏది నిజం ఏది అబద్దం అనేది మనం తేల్చి చెప్పలేం గానీ, ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో అనడానికి నివేదిత జైన్ లాంటి ఇంకెంతో మందిని మాత్రం ఒక మంచి ఉదాహరణగా చూపించవచ్చు .