వివాహం చేసుకునే స్త్రీ – పురుషుల మధ్య ఆ గ్యాప్ ఎంత ఉండాలో తెలుసా..?

మనిషి జీవితంలో వివాహం అనే పదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుచేతనే పెళ్లి చేసుకున్న భాగస్వామి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. నిజానికి పురాణాల ప్రకారం పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా అన్ని వేడుకల కంటే వివాహం అనేది చాలా ఘనమైనదని చెబుతూ ఉంటారు. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది కాబట్టే పురాణాల్లో సైతం పెళ్లి గురించి ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు.

అయితే ప్రస్తుతం యుగంలో ఎక్కువగా స్రీలను స్త్రీలు.. పురుషులను పురుషులు కూడా వివాహం చేసుకుంటున్నారు. కానీ అది మధ్యలో ఎవరో ఒకరు ఇద్దరు ఇలా వివాహం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు స్త్రీ – పురుషులు వివాహం చేసుకుంటే ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉండాలో ఒకసారి తెలుసుకుందాం. మనదేశంలో పురుషుల కనీస వయస్సు 21 స్త్రీల వయస్సు 18 ఏళ్లుగా ఇలా వయసు నిర్ణయించడం జరిగింది ఇందుకు కారణంగా స్త్రీలు ,పురుషుల కంటే కాస్త ముందుగానే పరిపక్వత చెందుతారు.

కాబట్టి ఈ ఏజ్ లోనే ఎక్కువగా వివాహాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో ఉద్యోగం రావాలంటూనే కనీసం 25 ఏళ్లు వస్తున్నాయి.. కాబట్టి ఉద్యోగం రాక ముందే వివాహం చేసుకుంటే ఆదాయం లేక ఇద్దరు మధ్య గొడవలు తలెత్తుతాయని ఉద్దేశంతోనే ఎలా బతకాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. అయితే ఇదంతా యిలా వుండగా మరికొంతమంది 30 ఏళ్లు దాటినా కాని వివాహం గురించి ఆలోచించడం లేదు. ఆ తర్వాత సంబంధాలు వెతికే సరికి వారికి కాస్త 35 ఏళ్లు వస్తాయి.

కాబట్టి 30 ఏళ్లు లేదా అంతకంటే రెండేళ్ల చిన్న వారిని వివాహం చేసు కుంటూ ఉంటారు. అలా వయసు పెరిగిన తర్వాత వివాహం చేసుకుంటే.. పిల్లలు పుట్టే విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా పురుషులకు 25 దాటిన తర్వాత 30 లోపు వివాహం చేసుకుంటే మంచిది.. ఇక ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు తమ కంటే 3 నుండి 7 యేళ్ళ వరకు చిన్నవారైన స్త్రీలను వివాహం చేసుకుంటే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.