RadheShyam Genuine Talk: ఫస్ట్ టైం రొమాంటిక్ సీన్స్ లో లిమిట్స్ దాటేసిన ప్రభాస్..!!

డైనమిక్ డైరెక్టర్ రాధా కృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా..పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం..”రాధే శ్యామ్”. భారీ అంచనాల మధ్య కొద్ది గంటల క్రితమే రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది అంటూ అభిమానులు చెబుతుంటే .. మరికొంత మంది ఏమో అక్కడ అంత సీన్ లేదు..ఓకే ఒకే సినిమా అంటూ దారుణ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి ఇలాంటి కామెంట్స్ కాదు.. ఒక్క షో తోనే సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది అంటున్నారు.

మనకు సీన్ మొదలవ్వడమే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చూయిస్తారు. అంటే 1976 లో కి మనల్ని తీసుకెళ్తారు. నవంబర్ 1976 లో ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రారంభం అవుతుంది. సత్యరాజ్ దగ్గర హస్తసాముద్రికం అనే విద్యను నేర్చుకుంటూ ..అతని దగ్గరే విద్యార్థిగా ఉంటాడు మన విక్రమాదిత్య(ప్రభాస్). ఇక్కడ మనం చెప్పుకోతగిన విషయం ఏమిటంటే ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం ప్రభాస్ ని మర్చిపోతాం..కేవలం విక్రమాదిత్యనే గుర్తుపెట్టుకుంటాం. అంతాలా లీనమైపోయి నటించాడు ప్రభాస్. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నారని ముందే గ్రహించిన విక్రమ్ ఇండియాని వదిలి..ఫారిన్ కంట్రీ కి వెళ్లిపోతాడు. అక్కడే సినిమా స్టార్ట్ అవుతుంది.

ఇక ఓ రోజు ట్రైన్ లో అనుకోకుండా కలిసిన ప్రేరణ (పూజా) తో చూసి చూడంగానే ప్రేమలో పడిపోతాడు ..ఆమె ను అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇక దానికి ప్రేరణ ఇచ్చే కౌంటర్స్ తెర పై బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ముఖ్యంగా పూజా-ప్రభాస్ మధ్య వచ్చే కాన్వర్సేషన్స్ చాలా బాగా ఉంటాయి. అచ్చం లవర్స్ మధ్య వచ్చే సరదా మాటలని..బాగా చూయించాడు డైరెక్టర్. ఇక ఈ చిత్రంలో డార్లింగ్ ప్రభాస్- పూజ హెగ్డే కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన సినిమాలు చూసిన్నట్లైతే ఎప్పుడు కూడా రొమాన్స్ లో హద్దులు దాటలేదు. ఒక్క పౌర్ణమి సినిమాలో త్రిషతో కొన్ని రొమాంటిక్ సీన్స్ ని చూయిస్తారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ పూజా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ చాలా చక్కగా తెరకెక్కించారు. వల్గారిటీ లేకుండా సినిమాకు కావాల్సినంత రొమాన్స్ ను తీసుకుని..ఆ సీన్ కి అలా ఉండటమే కరెక్ట్ అంటూ మన ప్రేమను ఇష్టపడిన వ్యక్తికి తెలియజేయటం కోసం చూపిస్తున్నట్లు బాగా చూయించారు. మనం ఈ సినిమా లో ప్రభాస్ లోని ఢిఫరెంట్ రొమాంటిక్ పర్సన్ ని కూడా చూడవచ్చు. తెర పై ఈ జంట కెమిస్ట్రీ సూపర్బ్ అనిపించుకుంటుంది. ఫైనల్ క్లైమెక్స్ ట్విస్ట్ తో పిచ్చెక్కించాడు డైరెక్టర్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ ఇది..చెప్పడం కన్నా కూడా చూస్తేనే బాగుంటుంది.