న‌ట వార‌స‌త్వం విష‌యంలో ఎన్టీఆర్ ముందుచూపు ఇదే..!

రాజ‌కీయాలైనా.. సినిమాలైనా.. వార‌సుల‌కు కొద‌వ‌లేదు. ఆయా రంగాల్లో తమ వార‌స‌త్వం కొన‌సాగాలని కోరు కునేవారు చాలా మంది ఉంటారు. ఎక్క‌డో ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. అంద‌రూ వార‌సుల‌కు అగ్ర‌స్థానం క‌ల్పించేందు కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇలాంటి వారిలో అన్న‌గారు ఎన్టీఆర్ కూడా ముందువ‌రుస‌లోనే ఉన్నారు. తొలినాళ్ల‌లో ఆయ‌న సినిమాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా త‌న వార‌సుల‌ను రంగంలొకి తెచ్చారు. అయితే.. అంద‌రిలా కాకుండా..అన్న‌గారి దూర దృష్టి విభిన్నంగా ఉండేది.

నిజానికి అప్ప‌ట్లో(పాత‌త‌రం) సినిమా న‌టులు.. త‌మ వార‌సుల‌ను రంగంలోకి తెచ్చేందుకు జంకేవారు. ఒక టి… అప్ప‌టి నిర్మాత‌లు .. ఇప్ప‌ట్లా కాకుండా.. అన్నీ ఆచితూచి వ్య‌వ‌హ‌రించేవారు. ఎంత వార‌సులైనా కూ డా.. వారిలో స‌త్తా లేకపోతే.. అవ‌కాశం ఇచ్చేవారు కాదు. ఎందుకంటే.. అప్ప‌ట్లో నిర్మాత‌లు ఖ‌ర్చును చాలా జాగ్ర‌త్త‌గా పెట్టేవారు. ఒక్క‌రూపాయి వేస్ట‌యినా.. ఒప్పుకొనేవారు. దీంతో ఎంత అగ్ర‌హీరోలైనా.. త‌మ వార‌సుల‌ను తెర‌మీదికి తెచ్చేందుకు చాలా ఇబ్బందిప‌డే ప‌రిస్థితి ఉండేది.

అలాంటి స‌మ‌యంలో అన్న‌గారు త‌న ఇద్ద‌రు వార‌సుల‌ను కూడా రంగంలోకి తీసుకువ‌చ్చారు. నంద‌మూరి బాల‌య్య‌, హ‌రికృష్ణ‌లు. ముందుగా హ‌రికృష్ణ‌ను తెర‌మీదికి తెచ్చారు. అయితే.. నిర్మాత‌లు ముందుగా.. ఎన్టీఆర్ కుమారులైనా కూడా ఆలోచించారు. దీంతో ఎన్టీఆర్‌.. “మాకు రూపాయి వ‌ద్దు. మా వాళ్ళకి ఇది అప్రెంటిస్ షిప్‌. న‌డిపించేందుకు నేనున్నానుగా!“ అని చెప్పేవారు. అంతేకాదు.. వారి మేక‌ప్‌కు అయ్యే ఖ‌ర్చు, ఆహారం అంతా కూడా త‌నకు ఇచ్చే రెమ్యూన‌రేష‌న్ నుంచి తిరిగి ఇచ్చేసేవార‌ట‌.

ఇక‌, నంద‌మూరి వార‌సులు చిన్న‌వ‌య‌సులోనే న‌టించిన సినిమాలు.. చాలా నే ఉన్నాయి. బాల‌య్య తాత‌మ్మ క‌ల చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. దీనికి అప్ప‌టి అగ్ర తార భానుమతి నిర్మాణం, హీరోయిన్ కూడా. త‌న కుమారుడిని ఎంట్రీ ఇచ్చినందుకు.. అన్న‌గారు ఎదురు ఆమెకు అప్ప‌ట్లో రూ.1500 ఖ‌ర్చుల కింద ఇచ్చేశార‌ట‌. ఇక‌, హ‌రికృష్ణ ఎంట్రీ ఇచ్చిన తొలిసినిమా శ్రీకృష్ణావ‌తారం. దీనికి అప్ప‌ట్లో పుండ‌రీకాక్ష‌య్య నిర్మాత‌గా వ్య‌వ‌హరించారు. పైగా 1964వ సంవ‌త్స‌రం. ప్ర‌తిరూపాయికీ లెక్క‌. ప‌పైగా హ‌రికి తొలిసినిమా కావ‌డంతో అన్న‌గారు.. ముందుగానే రూ.200(అప్ప‌ట్లో ఇది చాలా ఎక్కువ‌) ఇచ్చేశారు.

త‌న కుమారుడికి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరార‌ట‌. అయితే.. సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో పుండ‌రీకాక్ష‌య్య‌.. సినిమా 100 రోజుల పండుగ‌రోజు మ‌రో 300 క‌లిపి హ‌రికి రూ.500 కానుక‌గా ఇచ్చార‌ట‌. ఇవ‌న్నీ కూడా.. గుమ్మ‌డి రాసిన నా అనుభ‌వాలు పుస్త‌కంలో రాసుకున్నారు. అంటే.. ఇప్ప‌ట్లో మాదిరిగా..వార‌సుల‌ను ప్ర‌జ‌ల‌పై రుద్ద‌డానికి.. నిర్మాత‌ల‌కు భారం కావ‌డానికి అప్ప‌ట్లో ఎన్టీఆర్ ఒప్పుకొనేవారు కార‌ని ఆయ‌న రాసుకొచ్చారు. మ‌రి .. దీనిలో నీతి అర్ధ‌మైతే.. నిర్మాత‌ల‌కు ఎంతో కొంత మేలు చేసిన వారే అవుతారు!!