భీమ్లా నాయక్ తో పవన్ వాళ్ళ పంచ ఊడగొట్టిన్నట్లెనా..?

కోట్లాడి మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూస్తున్న మూవీ ‘భీమ్లా నాయక్’ ఎట్టకేలకు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదో జాతర.. అదో పండగ అభిమానులకి. నిజం చెప్పాలంటే ఆయన సినిమా లు రిలీజ్ అవుతున్నాయి అంటే కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, పవన్ కళ్యాణ్‌ని ద్వేషించేవారికీ కంటి మీద కునుకు వుండదు అని అంటుంటారు ఆయన అభిమానులు. అది ఎందుకో మనందరికి తెలిసిందే. దాని గురించి మళ్ళీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ విషయంలో ఎన్ని హంగామాలు నడిచాయో మనం చూసిందే. కొందరు సినిమా డేట్ ను పట్టుబట్టి వాయిదా వేయించగా ..మరి కొందరు ఎలాగైన పవన్ సినిమాకు తొక్కేయాలని..ఆయన సినిమాకి ఫ్లాప్ టాక్ రావాలని తెగ ట్రై చేశారు, కానీ కష్టాని నమ్ముకున్నవాడు ఎప్పుడు భయపడాడు, అధైర్యపడడు. పవన్ కూడా అంతే ..తన కష్టాని నమ్ముకుని సినిమాని రిలీజ్ చేశాడు. బాక్స్ ఆఫిస్ వద్ద బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా పై ముందు నుండి ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా చిత్రీకరించాడు డైరెక్టర్ సాగర్ చంద్ర.

ఇక ఈ సినిమా కి పవన్ కల్యాణ్ హీరోయిజం బిగ్గెస్ట్ ప్లస్ అయితే..రానా విలనిజం సినిమాని మరో మెట్టు పై కి ఎక్కించింది. వీళ్ల మధ్య వచ్చే సీన్స్ కేక. ధియేటర్స్ లో అయితే అరుపులు వినిపిస్తున్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం డైరెక్టర్ ఎక్కడ కూడా రానా పాత్రని తక్కువ చేయలేదు..పవన్ పాత్ర ని ఎక్కువ చేయలేదు..ఇద్దరికి సమానంగా ఉండేలా క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఇక తెర పై రానా, పవన్ యాక్టింగ్ తోడు ధమన్ బీట్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ఓవర్ ఆల్ గా చెప్పాలంటే సినిమా సూపర్ హిట్ అంటున్నారు ఫ్యాన్స్. ఇక సినిమాని తొక్కేయాలని నానా రకాలుగా ప్రయత్నించినా వారిని ఈ రిజల్ట్ తో .. పవన్ పంచ ఊడగొట్టిన్నట్లే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ధియేటర్స్ వద్ద అరుపులు కేకలతో రచ్చ చేస్తున్నారు.