R R R రిలీజ్ మ‌ళ్లీ డౌటే.. ఈ సారి మ‌రో కొత్త చిక్కు..!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో త్రిబుల్ ఆర్ సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యిందో కాని.. అప్ప‌టి నుంచి అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతున్నాయి. మూడేళ్ల‌కు పైగా ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటూనే ఉంది. ముందు షూటింగ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఇద్ద‌రూ రెండేసి సార్లు గాయ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వ‌చ్చిన త్రిబుల్ ఆర్ మూడు సార్లు వాయిదాలు ప‌డింది. ఎప్పుడో 2020 జూలైలో రావాల్సిన ఈ సినిమా 2021కు వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత 2021 సంక్రాంతి అన్నారు.. వెళ్లిపోయింది. 2022 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7 రిలీజ్ అన్నారు. ఆ త‌ర్వాత మ‌రో రెండు డేట్లు లాక్ చేశారు.

ఆ రెండు డేట్లు కాద‌ని మార్చి 25కు వాయిదా వేశారు. మార్చి 25న రిలీజ్ అవుతుండ‌డంతో 50 రోజుల ముందు నుంచే కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసి హంగామా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ డేట్‌కు అయినా ఈ సినిమా వ‌స్తుందా ? అంటే గ్యారెంటీ లేద‌ని తెలుస్తోంది. ఓ వైపు ప‌రీక్ష‌ల సీజ‌న్‌, మ‌రోవైపు ఐపీఎల్ స్టార్ట్ అవుతోంది. ఇవ‌న్నీ ఇప్పుడు త్రిబుల్ ఆర్ టీంను టెన్ష‌న్‌లో పెట్టేస్తున్నాయి.

ప్ర‌తి యేటా ఏప్రిల్లో ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఉంటాయి. ఆ త‌ర్వాత సెల‌వులు ఉంటాయి. మార్చి – ఏప్రిల్ నెల‌లు ఎప్పుడూ ప‌రీక్ష‌ల సీజ‌న్లే. అలాంటి టైంలో పెద్ద సినిమాలు రిలీజ్ చేయ‌రు. అయితే ఈ సంవ‌త్స‌రం క‌రోనా దెబ్బ‌తో ప‌రీక్ష‌లు కాస్త ఆల‌స్యంగా మార్చి, ఏప్రిల్ నెల‌ల్లోనే జ‌రుగుతున్నాయి. పైగా అదే టైంలో వ‌రుస‌గా పెద్ద సినిమాలు రిలీజ్‌కు ప్లాన్ చేశారు. మ‌రి రాజ‌మౌళి ముందు వెన‌కా ఆలోచించ‌కుండా మార్చి 25 రిలీజ్ డేట్ వేశారు.

ఇప్పుడు భారీ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టాల్సి ఉండ‌డంతో మ‌రోసారి ఈ సినిమాను మే / జూన్‌కు వాయిదా వేసే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సారి ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లో ఐపీఎల్ ఉంది. ఈ సారి 10 జ‌ట్లు.. టోర్నీ ఎక్కువ రోజులు జ‌ర‌గ‌నుంది. అందుకే ఈ సారి సినిమాల‌కు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఏపీలో టిక్కెట్ల రేట్లు కూడా తేలలేదు. ఈ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆర్ టీం టెన్ష‌న్ ప‌డుతోంద‌ట‌. ఇండ‌స్ట్రీలో అయితే మరోసారి ఈ సినిమా వాయిదా వేయ‌క‌త‌ప్ప‌దంటున్నారు.


Leave a Reply

*