6 నెల‌ల్లో 2439 మందిపై రేప్‌.. రోజుకు 11 మందిపై రేప్‌.. ఇంత దారుణ‌మా..??

దాయాది దేశం అయిన పాకిస్తాన్‌లో రోజు రోజుకు అత్యాచారం సంస్కృతి బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గ‌త ఆరు నెల‌ల్లో ఏకంగా 2439 మంది మ‌హిళ‌లు అత్యాచారానికి గుర‌య్యార‌ని నివేదిక‌లు చెపుతున్నాయి. కుటుంబ గౌర‌వం, ప‌రువు పేరుతో మ‌రో 90 మంది చంప‌బ‌డ్డార‌ని.. పంజాబ్ ఇన్ప‌ర్‌మేష‌న్ క‌మిష‌న్ డేటా చెపుతోంది. ఇదే స‌మ‌యంలో పంజాబ్ రాజ‌ధాని లాహోర్‌లో 400 మంది మ‌హిళ‌లు రేప్‌కు గురికాగా… మ‌రో 2300 మంది మ‌హిళ‌లు కిడ్నాప్‌కు గుర‌య్యారు.

పాకిస్తాన్ హ్యూమ‌న్ రైట్స్ క‌మిష‌న్ ప్ర‌కారం పాకిస్తాన్‌లో ప్ర‌తి రోజు 11 రేప్ కేసులు న‌మోదు అవుతున్నాయి. 2015- 21 మ‌ధ్య కాలంలో పోలీసుల‌కు ఏకంగా 22 వేల రేప్ ఫిర్యాదులు అందాయి. ఈ 22 వేల కేసుల్లో కేవ‌లం 77 మంది మాత్ర‌మే దోషులుగా తేలారు. ఇందులోనూ 0.3 శాతం మందికి మాత్ర‌మే శిక్ష‌ప‌డింద‌ని నివేదిక‌లో పేర్కొన్నారు.

బాధితుల‌ను నిందిస్తూ.. నేర‌స్తుల‌కు మేలు చేసేలా ఈ స‌మాజం ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని కూడా ఈ హ్యూమ‌న్ రైట్స్ నివేదిక పేర్కొంది. దేశంలో అత్యాచార, కిడ్నాప్ సంస్కృతి పెరిగిపోతుండ‌డంతో పాటు లైంగీక వేధింపుల బాధితుల‌ను కూడా నిందిచ‌డంతో పురుషుల్లో హింసాత్మ‌క సంస్కృతి పెరిగిపోతోంద‌ని లాహోర్ వ‌ర్సీటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ చెప్పింది.

ఇక ప్ర‌పంచంలోనే ప‌రువు హ‌త్య‌లు ఎక్కువుగా జ‌రుగుతోన్న దేశాల్లో పాకిస్తాన్ ఒక‌టి. అక్క‌డ ఏ మ‌హిళ వ‌ల్ల అయినా త‌మ ప‌రువు పోయింది అనుకుంటే.. ఆ కుటుంబానికి చెందిన వారే ఆ మ‌హిళ‌ను హ‌త్య చేసేస్తూ ఉంటారు. గ‌త వారం లాహోర్‌లోనే సామూహిక అత్యాచారానికి గురైన ఓ మ‌హిళ‌ను సొంత సోద‌రుడే హ‌త్య చేశాడు. 28 ఏళ్ల బాధితురాలు, ఐదుగురు పిల్లల తల్లి. ఆమెను న‌లుగురు వ్య‌క్తులు రేప్ చేయ‌డంతో ఆమె సోద‌రుడే ప‌రువు పోయింద‌ని చంపేశాడు. ఇక పాకిస్తాన్‌లో 21 శాతం మంది అమ్మాయిలకు 18 ఏళ్లలోపు వివాహం జరుగుతుండగా, 3 శాతం మందికి 15 ఏళ్లలోపు వివాహం జరుగుతోంది.


Leave a Reply

*