బాల‌య్య డేరింగ్ ప‌వ‌న్‌లో ఎందుకు లేదు…!

ఎస్ ఇప్పుడు ఇదే విష‌యం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఏపీ ప్ర‌భుత్వానికి సినిమా ఇండ‌స్ట్రీకి మ‌ధ్య గ్యాప్ అయితే ఉంది. దాని ప‌రిష్కారం కోసం చిరంజీవి ఆధ్వ‌ర్యంలో చాలా మంది చేయాల్సిన ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే సినీ హీరోలు అయిన బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ కూడా సినిమాల్లోనూ, ఇటు రాజ‌కీయాల్లోనూ ఉన్నారు. బాల‌య్య టీడీపీ ఎమ్మెల్యే, ప‌వ‌న్ క‌ళ్యాన్ జ‌న‌సేన అధినేత‌.

మొన్నామ‌ధ్య బాల‌కృష్ణ సీఎం మీటింగ్‌కు ఎందుకు వెళ్ల‌లేదు అని ప్ర‌శ్నిస్తే నాకు అవ‌స‌రం లేద‌ని.. పైగా అన్ని ఆంక్ష‌లు పెట్టి.. టిక్కెట్ రేట్లు త‌క్కువుగా ఉన్నా కూడా నా అఖండ హిట్ అయ్యింది.. ఎక్కువ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది అని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. బాల‌య్య ఈ గొడ‌వ‌ను పూర్తిగా లైట్ తీస్కొన్నారు. మ‌రి ఇప్పుడు ప‌వ‌న్ మాత్రం ఏం చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. ఏదోలా ఏపీ ప్ర‌భుత్వంపై త‌న అసంతృప్తి, అక్క‌సు వెళ్ల‌క‌క్కుతూనే ఉన్నారు.

భీమ్లానాయ‌క్ హిట్ అయితే.. నిజంగా బాల‌య్య కంటే పెద్ద ఇమేజ్ , స్టామినా ప‌వ‌న్‌కు ఉంటే అఖండ‌ను మించి వ‌సూళ్లు రావాలి. ఏపీలో బెనిఫిట్ షోలు, అద‌న‌పు షోలు లేవు. టిక్కెట్ రేట్లు త‌గ్గించేశారు అని ఒక్క‌టే ప్ర‌చారం చేస్తున్నారు. భీమ్లానాయ‌క్ ఆంధ్రాను రు. 40 కోట్ల రేషియోలో అమ్మారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో అప్పుడే ఈ సినిమా ట్రేడ్‌, చిత్ర యూనిట్ వ‌ర్గాల్లో గుబులు మొద‌లైంది.

ప‌వ‌న్ కూడా ఏపీ ప్ర‌భుత్వం త‌న‌పై క‌క్ష సాధిస్తుంద‌నే న‌మ్ముతున్నారు. దీనిపై ఇప్ప‌టికే గ‌గ్గోలు పెట్టిన ప‌వ‌న్ ఇప్పుడు త‌న భీమ్లానాయ‌క్ సినిమాను అలాగే టార్గెట్ చేస్తోంద‌న్న ఆగ్ర‌హంతో ఉన్నార‌ట‌. నిజంగా సినిమాలో ద‌మ్ముంటే టిక్కెట్ రేట్లు త‌క్కువుగా ఉంటే అభిమానులు ఒక‌టికి రెండు సార్లు చూస్తారు. సినిమా విజ‌యాన్ని ఎవ్వ‌రూ ఆప‌లేర‌న్నది అఖండ‌, పుష్ప ఫ్రూవ్ చేశాయి. మ‌రి బాల‌య్య‌లో ఉన్న ధైర్యం ప‌వ‌న్‌కు ఎందుకు లేదు ? అన్న‌దే ఇప్పుడు సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపించే టాక్