గూస్ బంప్స్ తెప్పించే వీడియోని షేర్ చేసిన చరణ్..అబ్బబ్బా ఏముందిలే తప్పక చూడాల్సిందే..!!

ప్రస్తుతం బాక్స్ ఆఫిస్ వద్ద ఎలాంటి పరిస్ధితి నెలకొందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పండగ వాతావరణం లా ఉంది అంతా. దానికి కారణం ఏంటో మన అందరికి తెలిసిందే. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న మూవీ..రిలీజ్ కాబోతున్న రోజు. యస్..ఎవరి పేరు చెప్పితే అభిమానులు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతారు.. ఎవరు డ్యాన్స్ చూస్తే మంచం లో ఉన్న ముసలి వాళ్ళకు కూడా ఊపు తెప్పిస్తుందో..ఆయనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటిల భారీ మల్టిస్టారర్‌ చిత్రం ‘భీమ్లా నాయక్‌’. పవన్ పోలీస్ ఆఫిసర్ గా నటించిన ‘భీమ్లా నాయక్‌’ మరి కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా..ఎట్టకేలకు రేపు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ఇటూ మెగా ఫ్యాన్స్‌, అటూ దగ్గుబాటి ఫ్యాన్స్‌ ఉత్కంఠగా మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ధియేటర్స్ వద్ద ఫుల్ సందడి సందడి గా ఉంది.

ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ చరణ్ మెగా అభిమానుల్లో డబుల్ జోష్ నింపడానికి ఓ వీడియోని షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ పూనకాలు లోడింగ్ అన్నట్లు ఊగిపోతున్నారు. చరణ్ షేర్ చేసిన ఆ వీడియోలో ఏముందంటే.. ‘భీమ్లా నాయక్‌’ సినిమా షూటింగ్ జరిగిన లోకేషన్స్ లో దగ్గరలోనే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కూడా జరిగిన్నట్లు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది.
ఇక షుటింగ్ టైం గ్యాప్ లో చిరు ‘భీమ్లా నాయక్‌’ సెట్ లోకి రావడం అక్కడ ఉన్న వారితో సరదాగా మాట్లాడటం..కలిసి ఫోటోలు దిగ్గిన్నట్లు తెలుస్తుంది. అలాగే పవన్ కూడా గాడ్ ఫాదర్ సెట్స్ లో కి వెళ్ళి అక్కడి బృందంతో సరదాగా ఉండటం మనం ఈ వీడియోలో చూడవచ్చు. కాగా ఈ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ గా భీమ్లా నాయక్‌ టైటిల్ సాంగ్ హైలెట్ గా నిలిచింది. ఈ వీడియో చూసిన మెగా అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు. అన్న-తమ్ముడిని ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే..చాలా హ్యాపీగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం ఆ చరణ్ షేర్ చేసిన ఆ వీడియోని మీరు చూసేయ్యండి..!!