స్నేహా కంటే ముందే బన్నీ ఆ హీరోయిన్ ని లవ్ చేశాడా..వామో ఇదేం ట్వీస్ట్ సామీ..?

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ ఫన్ ఉంటాది. పక్కాగా చెప్పాలంటే ఓ పండగ లాంటి వాతావరణం ఉంటుంది. మొదటి నుండి బన్నీ చాలా చలాకీ అయినా కుర్రాడట. చిన్నతనంలో కూడా ఏదైన ఫంక్షన్ కి వెళ్లితే అందరిని తనవాళ్లే అనుకుంటూ..కలిసిపోయి మాట్లాడుతూ ఉండేవాడట. ఇక పెద్ద అయ్యాక కూడా అదే అలవాటు కంటీన్యూ అయ్యింది. ఇప్పటికి బన్నీ ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్లితే సరదాగా ఆటపట్టిస్తూ..నవ్వుతూ..నవ్విస్తూ..జాలీగా ఉంటాడట.

ఇక ఈయన పనిచేసే నటీ నటులు కూడా అదే చెప్పుతుంటారు . బన్నీ ఎక్కడ ఉంటే అక్కడ అందరు నవ్వుతూ ఉంటారు అని. అందుకే కాబోలు ఈయన తో వర్క్ చేయడానికి అందరూ ఇష్టపడతారు. అయితే ఎంతటి కింగ్ లాంటి కుర్రడైనా..తోపైన హీరో అయినా ఒకరికి లొంగాల్సిందే. అలానే బన్నీ తన భార్య స్నేహా రెడ్డి చూపులకు ఫిదా అయ్యి..లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ప్రేమలో పడిపోయాడు. ఇక ఆ తరువాత ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవడం..ఇద్దరు పిల్లలు పుట్టడం..వాళ్ళు కూడా చైల్డ్ ఆర్టిస్ట్లు గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండటం చకచకా జరిగిపోయాయి.

అయితే, ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే..బన్నీ స్నేహా కన్నా ముందే ఓ హీరోయిన్ ని లవ్ చేశాడట. తన భార్య గా కూడా ఊహించుకున్నాడట. కానీ ఓ బడా స్టార్ హీరో వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇంతకి ఆ అందాల హీరోయిన్ ఎవరో తెలుసా..? ..పిల్లి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్. యస్.. బన్నీ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఐశ్వర్య రాయ్ ని లవ్ చేశాడట. కొన్ని సంధర్భాలల్లో ఆవిడనే తన భార్యగా ఊహించుకున్నాడట. కానీ ఆ తరువాత హీరో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. దీంతొ ఆ కధకు ఫుల్ స్టాప్ పడింది . ఇక ఇదంతా తెలిసి తెలియని వయస్సులో జరిగిందంటూ బన్నీ ఓ ఇంటర్వ్యుల్లో బయటపెట్టాడు. ఇప్పుడు బన్నీ స్నేహా తో హ్యాపీ గా ఉన్నాడు.