గౌత‌మ్‌రెడ్డి మృతికి అదే కార‌ణ‌మైందా…!

ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ( 49) ఈ రోజు ఉద‌యం గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆయ‌న వ‌య‌స్సు కేవ‌లం 49 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. ఇంత చిన్న వ‌య‌స్సులోనే ఆయ‌న మృతి చెంద‌డంతో అంద‌రూ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో హుటాహుటీన జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆయ‌న్ను ఆసుప‌త్రికి త‌ర‌లించేలోగానే మృతిచెందారు. ప్ర‌తి రోజు ఉద‌యం లేవ‌గానే గంట‌పాటు జిమ్‌లో వ్యాయామం చేయ‌డం అల‌వాటు.

ఇక గౌత‌మ్‌రెడ్డి ఇంత చిన్న వ‌య‌స్సులోనే హ‌ఠాన్మ‌ర‌ణానికి కార‌ణం ఏంట‌న్న‌దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అధికారికంగా చెప్ప‌న‌ప్ప‌ట‌కీ పోస్ట్ కోవిడ్ వ‌ల్లే ఆయ‌న మృతికి కార‌ణ‌మ‌య్యాయా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు. గౌత‌మ్‌రెడ్డి ఇప్ప‌టికే రెండుసార్లు క‌రోనా భారీన ప‌డ్డారు. క‌రోనా రెండో వేవ్‌లో ఆయ‌న గ‌తేడాది క‌రోనాకు గుర‌య్యారు. అయితే ఇటీవ‌ల మూడో వేవ్ వ‌చ్చిన‌ప్పుడు కూడా ఆయ‌న మ‌రోసారి కోవిడ్ భారిన ప‌డ్డారు. ఈ రెండు సార్లు కూడా ఆయ‌న హైద‌రాబాద్‌లో కోవిడ్‌కు చికిత్స తీసుకున్నారు.

గౌత‌మ్‌రెడ్డికి ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. ఇటీవ‌ల దుబాయ్ ఎక్స్‌పోలో ఏపీకి పెట్ట‌బ‌డుల కోసం జ‌రిగిన స‌ద‌స్సులో కూడా ఆయ‌న పాల్గొన్నారు. నిన్నే ఆయ‌న హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. పైగా రేపు సీఎం జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కూడా ఆయ‌న తీసుకున్నారు. ఇంత‌లోనే ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డం ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచి వేస్తోంది. మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి త‌న‌యుడుగా మంచి పేరున్న ఆయ‌న 2014, 2019 ఎన్నిక‌ల్లో రెండుసార్లు వ‌రుస‌గా నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.