ఫ్లాప్ అవుతుందని తెలిసికూడా.. మహేష్ చేసిన రెండు సినిమాలు ఏంటో తెలుసా?

హీరోలు దర్శకులు నిర్మాతలు ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కావలసింది కేవలం హిట్ సినిమాలు మాత్రమే. ప్రతి సినిమా హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తోనే తెరకెక్కిస్తు ఉంటారు. ఇక ఆ తర్వాత హిట్టవడం ఫ్లాప్ అవడం అనేది ప్రేక్షకులు చేతిలో ఉంటుంది. కానీ ఫ్లాప్ అవుతుందని ముందే తెలిస్తే ఎవరైనా సినిమా చేయడానికి ముందుకు వస్తారా.. ఇక ఫ్లాప్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా జోలికి వెళ్లడానికి కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు మాత్రం ఫ్లాప్ అవుతుందని తెలిసినప్పటికీ రెండు సినిమాలను కాస్త రిస్క్ చేసి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

తమిళంలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న మురుగదాస్ కు మహేష్ బాబు అభిమాని. ఈ క్రమంలో ఈయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ముందే అనుకున్న మహేష్ బాబు స్పైడర్ అనే కథ విన్నాడు. ఇక ఈ సినిమా సగం పూర్తయిన తర్వాత ఎక్కడో తేడా కొడుతుందని.. మహేష్ కు క్లారిటీ వచ్చేసింది. ఏం చేయలేక ముందుకు సాగాడు. చివరికి మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ చివరికి అంచనాలు తారుమారు అయ్యాయి.

ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మహేష్ బాబుకు హిట్ అందించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అయితే ఇదే నమ్మకంతో శ్రీకాంత్ అడ్డాలతో బ్రహ్మోత్సవం సినిమా చేశాడు మహేష్ బాబు. దర్శకుడి మీద నమ్మకంతో కథ కూడా వినకుండా ఓకే చెప్పేసాడు. షూటింగ్ సగం పూర్తయిన తర్వాత సినిమా స్క్రిప్ట్ పూర్తి కాలేదన్నా విషయం మహేష్ చెవిన పడింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహేష్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాతనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని డైరెక్టర్ పై సీరియస్ అయ్యాడట. ఆ తర్వాత కథ విన్న మహేష్ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినప్పటికీ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడట. చివరికి ఈ సినిమా భారీ అంచనాల మద్య వచ్చి డిజాస్టర్గా నిలిచింది.