షారుక్ ఇంటికి తప్పతాగి వెళ్లాను.. ఆ నిజం బయట పెట్టిన కపిల్ శర్మ?

బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఎందుకంటే ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ కమెడియన్. కపిల్ శర్మ షో ద్వారా ఎంతగానో పాపులారిటీ పొందాడు. ఎంతలా అంటే ప్రస్తుతం బాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన ప్పటికీ కపిల్ శర్మ షో లో ప్రమోషన్స్ కోసం రావాల్సిందే. ఇక ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో కపిల్ శర్మ ఐయాం నాట్ డన్ ఎట్ షో చేస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఇటీవల ఈ షోలో ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు కపిల్ శర్మ.. ఒకానొక సమయంలో తాను తప్పతాగి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇంటికి వెళ్లాను అంటూ చెప్పుకొచ్చారు.

ఒకసారి నా కజిన్ షారుక్ ఇంటిని చూడాలి అంటూ కోరింది. అప్పటికే నేను ఫుల్ గా తాగి ఉన్నాను. అయినప్పటికీ వెళ్దాం పద అంటూ అదే సమయంలో ఇక షారుఖాన్ ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో షారుక్ ఖాన్ ఇంట్లో ఏదో పెద్ద పార్టీ జరుగుతుంది. ఇక కార్ లో నన్ను చూసి ఆహ్వానించారేమో అనుకుని సెక్యూరిటీ గార్డులు కూడా గేటు ఓపెన్ చేశారు. ఆ సమయంలో నేను కేవలం నిక్కర్ మీద మాత్రమే ఉన్నాను. ఇక షారుఖాన్ మేనేజర్ కూడా నన్ను చూసి ఆహ్వానించారు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ భార్య గౌరీ మేడం కూడా చూసి నాకు ఆహ్వానం అందిందేమో అని అనుకుంది. షారుక్ అక్కడ గదిలో ఉన్నాడు అంటూ చూపించింది.

ఏం చేయాలో అర్థం కాలేదు మళ్లీ వెనక్కి వెళ్దాం అని అనుకున్నాను. కాని కాస్త ధైర్యం చేసి ఇంట్లోకి వెళ్ళగానే షారుఖాన్ డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇక వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి.. భయ్యా ఐ యాం సారీ నా కజిన్ మీ ఇల్లు చూడాలని ఉంది అంతే తీసుకువచ్చాను అంటూ అసలు విషయం చెప్పేశాను. దీంతో షారుక్ ఖాన్ ఒక్కసారిగా నవ్వి నా ఇంట్లోకి కాదు బెడ్ రూమ్ లోకి కూడా నువ్ వచ్చేయొచ్చు అంటూ నాతో కలిసి డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ నుంచి బయటపడిన నేను మళ్ళీ షారుక్ ఖాన్ తో కలిసి డాన్స్ చేశాను.. ఇక ఆ తర్వాత అక్కడ ఉన్న ఎంతో మంది నాతో ఫోటోలు కూడా దిగారు అంటూ కపిల్ శర్మ ఒక అనుభవాన్ని ఇటీవలే తన షోలో అభిమానులతో పంచుకున్నారు.