వర్రీ అయిపోతున్న నిఖిల్.. అయ్యో ఎంత కష్టమొచ్చింది?

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నిఖిల్ గుర్తున్నాడు కదా.. అదేనండి మా అయ్య పొద్దుటూరు ఎమ్మెల్యే అంటూ తెలంగాణ యాసలో మాట్లాడి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు.. హా.. గుర్తుకు వచ్చింది కదా అతనే. ఇక హ్యాపీ డేస్ తర్వాత ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నాడు. ఆ తర్వాత కాలంలో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ఇక మంచి క్రేజ్ ఉన్న యువ హీరోగా మారిపోయాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే హ్యాపీ డేస్ హీరో కి ఇక ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయని తెలుస్తోంది.

 

మొన్నటి వరకూ వరుస సినిమాలతో దూసుకుపోయినా యువ హీరోకి ఇప్పుడు మాత్రం కోవిడ్ వరుసగా షాకుల మీద షాకులు ఇస్తుంది. పాపం హీరో అయిపోయాడు గాని పిల్లాడు అయి ఉంటే ఆ బాధకు గుక్కపట్టి ఏడ్చే వాడేమో. ఇక నిఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అర్జున్ సురవరం సినిమా బాగానే ఆడింది.. అయితే ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా హిట్ అవడంతో ఫుల్ జోష్ లో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నిఖిల్. ఇక మళ్లీ ఫామ్లోకి వచ్చేసాను ఇంక నాకు తిరుగులేదు అని మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండు.

 

కానీ కోవిడ్ కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతుందని మాత్రం అస్సలు ఊహించలేకపోయాడు. అప్పుడెప్పుడో అప్డేట్ వచ్చినా 28 పేజెస్ సినిమా తోపాటు కార్తికేయ 2 సినిమా కూడా పూర్తి చేసుకొని ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. ఒకవేళ ఇవి అనుకున్న ప్రకారం విడుదల అయితే ఇప్పటివరకు అఖిల్ ఖాతాలో మరో హిట్టు చేరి పోయేది అని చెప్పాలి. అయితే ఇక ఈ రెండు సినిమాలతో పాటు మరో మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేసినట్లు గతేడాది అనౌన్స్ చేశాడు ఈ యువహీరో. అంతా బాగానే ఉంది కానీ కరోనా వైరస్ కారణంగా ఇవేవీ కూడా షూటింగ్ వరకు వెళ్లకపోవడం గమనార్హం.. దీంతో కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తన కెరీర్ గురించి నిఖిల్ తెగ వర్రీ అయిపోతున్నాడట. మరీ యువ హీరోకి అన్నీ ఎప్పుడూ కలిసి వస్తాయో చూడాలి.