గూగుల్ మెచ్చిన మహానటుడు ఎవరో తెలుసా..?

గూగుల్ లోని డూడుల్ లో ఫోటో రావడం అంటే అది అతిశయోక్తి కాదు.. గూగుల్ అతడిని మెచ్చి అతని ఫోటోను డూడుల్ లో పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంతకు ఎవరు ఆ నటుడు అని ఆలోచిస్తున్నారా.. ? ఆయన ఎవరో కాదు రజినీకాంత్ నటించిన నరసింహ సినిమాలో , తండ్రి పాత్ర పోషించిన నటుడు గుర్తున్నారా.. ? ఆయనే ఈయన.. దూరదృష్టవశాత్తు నరసింహ సినిమానే ఆయన చివరి సినిమా కావడం గమనార్హం.. ఈయన గురించి ఈ తరం యువతకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఆ కాలంలో అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు సాధించిన మొదటి భారతీయ నటుడు ఈయనే.. ఎన్నో అవార్డులు, మరెన్నో సత్కారాలు పొందిన ప్రముఖ నటుడు శివాజీ గణేషన్..

ఆయన జయంతి సందర్భంగా గూగుల్ ఘనంగా గౌరవించింది.. డూడుల్ లో ప్రత్యేకంగా ఈయన ఫోటో ని పెట్టింది.. ఇది చూసిన ప్రతి ఒక్కరు ఈ శివాజీ గణేషన్ గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..కొన్ని సంవత్సరాల కిందటే గ్లోబల్ నటుడిగా గుర్తింపు పొందారు. 1928 అక్టోబర్ 1వ తేదీన తమిళనాడులోని వల్లాపురం లో జన్మించారు. 1952 లో ప్రజాశక్తి అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈజిప్ట్ లోని కైరోలో 1960 లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో శివాజీ గణేషన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా లభించింది.. అమెరికాలో కూడా ఈయనకు ఎన్నో పురస్కారాలు లభించాయి..

Google Doodle remembers Sivaji Ganesan, the tallest actor in Tamil Cinema |  India News | Zee News

అంతేకాదు అమెరికాలో 1962లో ఈయనను కల్చరల్ అంబాసిడర్ గా అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ గుర్తించారు. ది లాస్ ఏంజెల్స్ టైమ్స్ ఈయనను మార్లోస్ బ్రాండ్ ఆఫ్ సౌత్ ఇండియన్ గా అభివర్ణించింది. 1997 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఆయన అందుకున్నారు. నేటి పాన్ ఇండియా హీరోల మాదిరిగానే ఈయన కూడా అప్పట్లోనే అంతర్జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇన్ని అవార్డులు సత్కారాలు పొందిన ఈయన కోసం గూగుల్ ప్రత్యేకంగా డూడుల్ ను ఏర్పాటు చేయడం గమనార్హం.