జగన్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రోజు ఏదో ఒక షాక్ తగులుతూనే ఉంది.మొన్న ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం జగన్ కు షాక్ తగిలింది ఇప్పుడు గణేష్ ఉత్సవాలను అనుమతించబొదంటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హైకోర్టు తప్పు పట్టింది. గణేష్ ఉత్సవాలను హైకోర్టు అనుమతిస్తూ ఏపీ సర్కార్ కు షాక్ ఇచ్చింది.

ఇక గణేశ్ ఉత్సవాలపై కొంతమంది హై కోర్టులో పిటిషన్ వేయగా.. వాటి గురించి విచారిస్తూ కోర్టు ప్రైవేటు స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు.మత కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది.కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించింది ప్రభుత్వం.

అంతేకాకుండా గణేశుని దగ్గర కేవలం ఒక్కసారి ఐదుగురికి మాత్రమే పూజలు చేసుకోవాలని. కండిషన్ను విధించింది. కేవలం పబ్లిక్ స్థలాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించకూడదని.అంతే కాకుండా ప్రభుత్వానికి ప్రైవేట్ స్థలాలలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి స్పందన వస్తుందో మనం వేచి ఉండాల్సిందే.