ఇకపై 12 యేళ్ళు మాత్రమే మనకు టైటానిక్ కనిపిస్తుంది.. ఆ తర్వాత..?

టైటానిక్ షిప్.. ఇదో విషాదకరమైన విషయం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదంగా మిగిలిపోయిన సంఘటన. ఇది జరిగి దాదాపు 110 సంవత్సరాలు అవుతోంది. 1912 ఏప్రిల్ 14వ తేదీన రాత్రి సమయంలో మంచు కొండను ఢీ కొట్టి , టైటానిక్ సముద్రంలో మునిగి పోయిన విషయం అందరికీ తెలిసిందే.. ఇకపోతే ఇందులో సుమారుగా 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.. ముఖ్యంగా నాటి నుంచి నేటికి కూడా ఈ టైటానిక్ గురించి ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.. రాయల్ మెయిల్ షిప్ టైటానిక్ బ్రిటన్లోని సౌతాంప్టన్ నుంచి బయలుదేరి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఎవరికీ తెలియని విధంగా మునిగిపోయింది. అంతే కాదు ఇది చరిత్రలో అతి పెద్ద సముద్ర విపత్తులలో ఒకటిగా మిగిలిపోయింది.

Titanic Secrets And Facts

ఇకపోతే అట్లాంటిక్ మహా సముద్రంలో మంచు కొండను ఢీకొట్టి మునిగిన 73 సంవత్సరాల తరువాత కెనడాలో , న్యూఫౌండ్ ల్యాండ్ కు సుమారుగా 700 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 4,000 మీటర్ల లోతున రెండు ముక్కలయింది. ఇకపోతే ఈ మోడల్ శిధిలాలను మరి కొన్ని సంవత్సరాలలో చూసే ఛాన్స్ కూడా ఉండదట. వినడానికి వింతగా ఉన్నప్పటికీ మరో 12 సంవత్సరాలలో టైటానిక్ సంబంధించిన ఒక ముక్క కూడా నీటిలో మిగలదు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఒక రకమైన బ్యాక్టీరియా టైటానిక్ అవశేషాలను చాలా వేగంగా తినేస్తోంది అని చెబుతున్నారు. ఇకపోతే ఆర్ ఎం ఎస్ టైటానిక్ సంస్థ పలు పరిశోధక యాత్రలు చేపట్టి, దాదాపు 5వేలకు పైగా బంగారు నాణాలు, వెండి పాత్రలు వంటివెన్నో ఈ టైటానిక్ శిథిలాల నుంచి బయటకు తీయడం జరిగింది