భార‌త్‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు..290 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి.

దేశంలో గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు నిన్న స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 29,616 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,36,24,419 కు చేరుకుంది. అలాగే నిన్న 290 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ‌గా.. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,46,658 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 28,046 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,28,76,319 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం 3,01,442 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, రోజూవారీ కేసుల్లో అత్య‌ధిక కేసులు కేర‌ళ నుంచే వ‌స్తున్నాయి. తాజాగా కేసుల్లోనూ 17,983 కేసులు కేర‌ళ‌లోనే న‌మోదు అయ్యాయి.