తారక్‌ను కొరడాతో కొట్టిన చరణ్.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్‌లో తెరకెక్కతున్న ప్రెస్టీజియస్ మల్టీ్స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కి్స్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా చెడుగుడు ఆడుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వార్త వచ్చినా సినీ జనం దాన్ని తప్పకుండా ఫాలో అవుతూ వస్తున్నారు.

కాగా తాజాగా ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చరణ్ తారక్‌ను కొరడాతో కొట్టే ఓ సీన్ ఉందని తెలుస్తోంది. అయితే చరణ్ తారక్‌ను ఎందుకు కొరడాతో కొడతాడా అనేది ఎవరి ఊహలకు అందడం లేదు. దీంతో అసలు ఈ మ్యాటర్ ఏమిటా అని జక్కన్నను స్వయంగా కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదట. అంటే.. ఈ సీన్ ఏమిటో, అందులో తారక్‌ను చరణ్ కొరడాతో ఎందుకు కొట్టాడో తెలియాలంటే సినిమాను థియేటర్లలో చూడాల్సిందే అని ఆయన అంటున్నాడు.

మరి ఈ సినిమాలో తారక్, చరణ్‌ల పర్ఫార్మెన్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, ఈ సినిమాలో వారి పాత్రలు ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాయా అనేది తెలియాలంటే మాత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటిష్ నటి ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.