బిగ్ బాస్ సరయు బ్రేక్ అప్ లవ్ స్టోరీ?

సరయు ఈ పేరు కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారికి ఈమె గురించి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా యూట్యూబ్ లో సెవెన్ ఆర్ట్స్ ఛానల్ లో ఆమె చేసిన అడవి కామెడీ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా కొన్ని వీడియోస్ ద్వారా ఈమె బాగా ఫేమస్ అయింది. అంతే కాకుండా ఈమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు. ఈమె నోరు తెరిస్తే చాలు బూతులు.. ఆ బూతుల తోనే ఆమె పాపులర్ బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టేసింది. ఇలా బూతులు మాట్లాడటం తో బిగ్ బాస్ షో నుంచి మొదటి వారమే బయటకు వచ్చేసింది.

అయితే సరయూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. ఒక వ్యక్తి తాను ఏడు ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నానంటూ, ఆ విషయం ఇద్దరి ఇంట్లో తెలుసు, అలా ఇంట్లో వాళ్లకు తెలియకుండా నేను ఏది చేయను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలాగే అతని తో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు నా కెరీర్ ను పక్కనపెట్టి అతని కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని, నేను వర్జిన్ కాదు మేము పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కాని కుదరలేదు. కట్నం దగ్గర గొడవ రావడంతో పెళ్లి పీటల దాకా వచ్చిన వివాహం ఆగిపోయింది. ముందు పాతిక లక్షలు అడిగారు తర్వాత అరకోటి ఆ తర్వాత కోటి ఆపై సగం ఆస్తి అడిగారు. ఇలా పెళ్లి కాకముందే ఇన్ని అడిగినవారు పెళ్లయ్యాక ఇంకెన్ని అడుగుతారు అని ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేశాను, నువ్వు నాకు తగిన వాడివి కాదు అంటూ అతనికి ముఖంమీద చెప్పేసాను అంటూ చెప్పుకొచ్చింది సరయు.