మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా సాధించిన రికార్డులు ఇవే..!

ఇండస్ట్రీలో శ్రీమంతుడు సినిమా తో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా తర్వాతే ఆయన తన సొంత గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతోంది. ఇక ఆ సినిమా యొక్క విశేషాలను తెలుసుకుందాం.

2015 వ సంవత్సరంలో మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ లో వచ్చిన మొదటి చిత్రంగా నిలిచింది.

బాహుబలి సినిమా విడుదల అయిన ఆరు మాసాల తర్వాత శ్రీ మంతుడు విడుదల కాగా… ఒక సంచలన విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో.. ఇప్పుడు ఒకసారి చూద్దాం. శ్రీమంతుడు సినిమా యూట్యూబ్లో దాదాపుగా 100 మిలియన్ల రాబట్టింది. అంతేకాదు ఇదే తొలి సినిమాగా రికార్డు అయింది. ఈ సినిమా 185 కేంద్రాలలో 50 రోజుల పాటు నడిచింది. 15 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది.

శ్రీమంతుడు సినిమా ద్వారా మహేష్ బాబు సరికొత్త గా కనిపించాడు. శ్రీమంతుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టిందని తెలుస్తున్నది. ఇక యూఎస్ లో రూ. 13 కోట్ల వరకు షేర్ ను రాబట్టిందట. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం అంతా కలిపి రూ. 12 కోట్ల వరకు రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రూ.26 కోట్ల వరకు షేర్ రాబట్టి, మొత్తం రూ.146 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాతోనే ఎంతోమంది రాజకీయ నేతలకు చలనం వచ్చి, తమకు తోచిన విధంగా సహాయాలు చేయడం మొదలుపెట్టారు.