కాబూల్ లో వాట‌ర్ బాటిల్ ధ‌ర రూ.3వేలు.. ఇక అన్నం ఎంతో తెలిస్తే..

ఇప్పుడు ప్ర‌పంచమంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ రాజధానిలో వ‌రుస‌గా జ‌ర‌గుతున‌న్న దారుణాల గురించే మాట్లాడుకుంటోంది. ఇక కాబూల్ ఎయిర్ పోర్టులో తాలిబన్లు ప్రవేశించడంతో అక్క‌డ వేలాదిగా ఉన్న జ‌నాలు కూడా దాదాపుగా పది రోజుల పాటుగా నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అక్క‌డ ప‌రిస్థితులు మొత్తం చాలా గందరగోళంగా క‌నిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.

 

ఇక మామూలుగానే తాలిబాన్ల చేసే అరాచకాల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటూనే ఉంటుంది. అయితే కాబూల్ ఎయిర్ పోర్టులో వీరివ‌ల్ల ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు నానా హింసకు గుర‌వుతున్నారు. ఎలాగైనా కాబూల్ విమానాశ్రయంలోకి వెళ్తేందుకు అక్క‌డే కొన్ని రోజులుగా వేల సంఖ్యలో జ‌నాలు ఎదురు చూస్తున్నారు. అక్క‌డున్న ప్రతి మనిషి కూడా ఎంతో ఆశ‌తో ఏ దేశ విమానంలో అయినా ఇంత చోటు దొర‌క్క పోతుందా అని ఎదురు చూస్తున్నారు.

 

కాగా ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ అక్క‌డ జ‌రిగిన ఓ వీడియో ఇప్పుడ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ ఎయిర్ పోర్టు బ‌య‌ట ఒక అమ్మాయి దాహం వేసి నీళ్లు తాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ఈ వీడియోలోనే తాలిబాన్ల ఎలాంటి దురాగతాలకు పాల్ప‌డుతున్నారో కూడా బట్టబయలు చేసింది. అయితే ఇప్పుడు కాబూల్ ఎయిర్ పోర్టు బ‌య‌ట వేల సంఖ్యలో ప్రజలు మూర్ఛపోతున్నార‌ని తెలుస్తోంది.

 

అయితే వారంతా కూడా ఎంత‌దుకు మూర్ఛపోతున్నార‌ని ఆరా తీయ‌గా ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు దాహం వేస్తే విదేశీ సైనికులే వారికి నీరు పోస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు విమానాశ్రయం వెలుపల ఒక లీడ‌ర్ బాటిల్ లో వాట‌ర్ కావాలంటే దాదాపుగా మ‌న క‌రెన్సీలో అయితే రూ.3వేల దాకా చెల్లాఇంచాలి. ఇక తినాల‌నుకుంటే మాత్రం రూ.7,500 వ‌ర‌క పెట్టాల్సిందే. ఇంత డ‌బ్బు వారి ద‌గ్గ‌ర లేక‌పోవ‌డంతో వారు విదేశీ సైనికుల వ‌ద్ద తాగుతున్నారు. ఇంకో విష‌యం ఏంటంటే ఇక్క‌డ ఆహారం, నీటిని కేవ‌లం డాల‌ర్ల‌లోనే అమ్ముతున్నారు.