రేవంత్ లో అయోమయం.. అందుకే రాహుల్ రాక..

హుజూరాబాద్ ఎన్నికల వ్యవహారంలో కారు దూసుకుపోతుంటే.. బీజేపీ కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అయోమయంలో పడిపోయింది. టీఆర్ఎస్, బీజేపీలు దాదాపు అభ్యర్థిని ప్రకటించికపోయినా వారికో క్లారిటీ ఉంది. ఎవరిని బరిలో దించాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం ఇంకా ఎవరు అనే విషయం కొలిక్కి రాలేదు.

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పీసీసీ చీఫ్ సమావేశం నిర్వహించినా ఎవరిని ఎంపిక చేయాలనేది తేల్చలేదు. అంతేకాక.. సీనియర్లు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహలను సిఫార్సు చేయాలని సూచించారు. మరి వారు ఎవరిని సిఫార్సు చేస్తారో.. ఆ వ్యక్తిని అధిష్టానం ఒప్పుకుంటుందో లేదో.. లేదో వారికే తెలియాలి.

ఈ విషయం పక్కన పెడితే రాష్ట్రంలో రాహుల్ పర్యటించేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. పర్యటనపై ఇప్పటికే రాహుల్ గాంధీతో మాట్లాడారు కూడా. కాంగ్రెస్ పార్టీ చేపట్టే దళిత, గిరిజన దండోరా కార్యక్రమానికి రాహుల్ వస్తారని కూడా చెప్పారు. ఒకవేళ రాహుల్ వస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగి తనకు మద్దతు పెరగుతుందనేది ఆయన భావిస్తున్నారు. రేవంత్ అన్నట్లు రాహుల్ పర్యటిస్తే.. హుజూరాబాద్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న పార్టీకి ఆయన పర్యటన బూస్ట్ ఇచ్చినట్లవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఏరోజు.. ఎప్పుడు.. ఎక్కడ పర్యటిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.