చలపతి రావు భార్య ఎలా చనిపోయిందో తెలుసా?

సీనియర్ నటుడు చలపతిరావు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపుగా ఐదున్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తన నటనతో ఆకట్టుకుంటూ ఎన్నో సినిమాలలో నటించారు. అయితే మొదట ఈయన విలన్ పాత్రలలో నటించారు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమా లో నాగార్జున కు తండ్రి పాత్రలో నటించాడు. ఈ సినిమా చలపతిరావు కెరీర్ను మలుపు తిప్పింది అని చెప్పవచ్చు. చలపతి రావు కొడుకు రవి బాబు కూడా నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఇకపోతే చలపతిరావు భార్య అగ్ని ప్రమాదంలో మరణించింది అన్న విషయం చాలా మందికి తెలియదు.

ఈ అగ్ని ప్రమాదం వేరే ఎక్కడో కాదు వారి ఇంట్లోనే ఈ అగ్ని ప్రమాదం జరిగింది. చలపతిరావు పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు పుట్టిన కొంతకాలానికే తన భార్య మృతి చెందడంతో అతని జీవితంలో పాటు అలాగే తన కుటుంబంలో అతి పెద్ద విషాదం నెలకొంది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో అందరూ ఉన్నారు. అప్పట్లో మద్రాసు లో రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వచ్చేవి. రాత్రి 2 గంటలకు రేపు పట్టుకోవాల్సిన వచ్చేది. అప్పుడు ఒక రోజు చలపతిరావు నీరు వస్తుంటే లేచి నేను పడతాను అంటే వద్దు నేను పెడతాను అంటూ చలపతిరావు భార్య వెళ్లిందట. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి కేకలు వినిపించాయి. అతను అక్కడికి వెళ్లి చూసేసరికి ఆమె చీర వెనుక వైపు తగలబడిపోతుంది. వెంటనే చలపతిరావు మంటను ఆర్పి ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఆమె మృత్యువుతో మూడురోజులు పోరాడింది. ఆ తర్వాత ఆమె ఒక రోజు చనిపోయింది. ఈ విషయాలన్నీ కూడా చలపతిరావు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.