ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఏం చ‌దువుకున్నారో తెలిస్తే షాకే!?

స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రాజ‌మౌళి.. స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్ర‌స్ అన‌డంలో సందేహ‌మే లేదు. తెరపై నవరసాలను సమపాళ్లలో రంగరించి చూపించగల సమర్దుడిగా పేరు తెచ్చుకున్న ఈయ‌న‌.. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచదేశాలకు పరిచయం చేశారు.

Happy Birthday SS Rajamouli: 7 must-watch films of the ace director besides  Baahubali | The Times of India

అటువంటి వ్య‌క్తి ఎంత వ‌ర‌కూ చ‌దువుకున్నారో తెలుసా.. టాలెంట్‌కు చ‌దువుతో ప‌ని లేక‌పోయినా ఆయ‌న చ‌దివింది కేవ‌లం ఇంట‌రే. బాహుబ‌లి సినిమా విడుద‌ల త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌నే స్వ‌యంగా ఈ విష‌యాన్ని చెప్పారు. జ‌క్క‌న్న సొంత ఊరు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు. అక్క‌డే నాల్గొవ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యాభ్యాసం చేశాడీయ‌న‌.

SS Rajamouli Birthday: From Student No. 1 to Baahubali - must-watch movies  by the Telegu director

ఇక‌ ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజ్‌లో ఇంట‌ర్ పూర్తి చేశారు. ఆ స‌మ‌యంలోనే తండ్రి విజేంద్ర ప్ర‌సాద్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్థిర‌ప‌డిపోవ‌డంతో.. రాజ‌మౌళి మ‌న‌సు కూడా అటు వైపు లాగింది. దాంతో చ‌దువుకు స్వ‌స్థి చెప్పి.. జ‌క్క‌న్న కూడా సినిమా బాట ప‌ట్టారు. ఆ త‌ర్వాత అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ.. ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్స్ లిస్ట్‌లో ఒక‌రిగా స్థానాన్ని సంపాదించుకున్నారు.

3 times Baahubali director SS Rajamouli spoke his mind and won our hearts |  Bollywood News – India TV