మంచి మనసు చాటుకున్న స్టార్ సింగర్..!

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ​ చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఆక్సిజన్ కొరతతో ఇబ్బందిపడుతున్నారు. ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు మృతిచెందిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది ప్రముఖులు ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి, ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తేవడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు సింగర్ స్మిత కరోనా రోగులకు సాయం అందించడానికి ముందుకొచ్చారు.

గతంలో ఆమె స్థాపించిన ఏఎల్​ఏఐ సంస్థతో సహా ఈఓ స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు ప్రాంతాల్లోని కొవిడ్​ కేర్​ సెంటర్లలో 100 ఆక్సిజన్​ బెడ్లను ఏర్పాటు చేయడానికి ఆమె పనులను మొదలు పెట్టారు. గత కొద్దిరోజులుగా ఆక్సిజన్ పడకల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. అయితే ఆ ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు పని పూర్తయ్యిందని, తాను అనుకున్న లక్ష్యం నెరవేరిందని స్మిత తెలిపారు. బెడ్లకు సంబంధించిన ఫొటోలను ఆమె ట్విట్టర్ లో పోస్ట్​ చేశారు. ఇందుకోసం తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.