మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి మృతి..!

May 3, 2021 at 3:16 pm

క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కరోనా కారణంగా ఇప్ప‌టికే కొందరు నాయ‌కులు చనిపోయారు. ఇప్పుడు తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ చెందిన మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి చనిపోయారు. ఏప్రిల్ 15వ తేదీన స‌బ్బం హ‌రికి క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అవ్వగా, ఆయన మూడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. కానీ ఆ తరువాత ఆయన ఆరోగ్య ప‌రిస్థితి బాగా విష‌మించ‌డంతో, డాక్టర్స్ సలహా మేర‌కు వైజాగ్ అపోలో ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యి, చికిత్స పొందుతున్నారు.

హ‌రికి పలు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతో వెంటిలేట‌ర్‌ పై ఆయనకి చికిత్స అందించారు. అయినా కూడా ఆయన ఆరోగ్య ప‌రిస్థితి బాగా విష‌మించి సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఆయన మృతి చెందారు. స‌బ్బం హ‌రి మృతి ప‌ట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాయ‌కులు అంతా సంతాపం తెలుపుతున్నారు. హరి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. స‌బ్బం హ‌రి విశాఖ మేయ‌ర్‌గా, అన‌కాపల్లి కాంగ్రెస్ ఎంపీగా సేవలు అందించారు. హరికి ఒక కుమారుడు, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు.

మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి మృతి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts