బ్రేకింగ్ : నీట్ పరీక్ష వాయిదా..?

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు శరవేగంగా వ్యాపిస్తున్న వేళ నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం. నాలుగు నెలల పాటు నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేస్తూ నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో నీట్ పరీక్షల నిర్వహణ పై అక్కడి అధికారులతో సమిష్టంగా మాట్లాడి, ఈ కీలక నిర్ణయం తీసుకునట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ఏప్రిల్ నెల 18న జరగాల్సిన నీట్‌ పీజీ పరీక్షను వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రోజు రోజుకు భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్న క్రమంలో, విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా పరిస్థితిని చక్క బడిన తరువాత పరీక్షల తేదీని వెల్లడిస్తామన్నారు.