హైకోర్టు వివాదంలో ‘ఇండియన్ 2’ సినిమా..?

భారతీయుడు 2 చిత్రం వివాదం కోర్టు కి ఎక్కింది. లైకా ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టు ఇండియన్ 2 మూవీ పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమా చేయటం సరి కాదంటూ కోర్టుని ఆశ్రయించింది. శంకర్ పారితోషికంలో కూడా చాలా వరకూ పే చేశామని లైకా కోర్టుకు తెలిపింది. గురువారం నాడు విచారణ జరిగింది. ఇరు వర్గాలు కూర్చొని సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని హైకోర్టు చెప్పింది.ఇండియన్ 2ని గత ఏడాది మార్చికే పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటికీ పూర్తి చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని లైకా కోర్టుకు తెలిపింది.

శంకర్ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలను వినిపించారు. ఇంకా ఇటీవల మరణించిన నటుడు వివేక్ పై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు మళ్లీ రీషూట్ చేయాలని, దానికి కొంత సమయం పడుతుందని శంకర్ కోర్టుకు తెలిపారట. ఈ కేసుకు సబంధించి తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది కోర్ట్. మరి కోర్టు చెప్పినట్టుగా లైకా, ఇంకా శంకర్ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారా లేక కోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటారా అన్నది వేచి చూడాలి.