‘ నేనే రాజు – నేనే మంత్రి’ కి క‌ళ్లు చెదిరే లాభాలు… లెక్క ఇదే

బాహుబ‌లి సినిమాలోని భళ్లాల‌దేవుడి క్యారెక్ట‌ర్‌తో ద‌గ్గుపాటి రానా దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిపోయాడు. ఈ యేడాది బాహుబ‌లి 2తో పాటు ఘాజి వంటి హిట్ సినిమాలో న‌టించిన రానా ఇప్పుడు తేజ డైరెక్ష‌న్‌లో నేనే రాజు – నేనే మంత్రి సినిమాలో న‌టించాడు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో రానా జోగేంద్ర అనే రాజ‌కీయ నాయ‌కుడిగా న‌టించాడు.

రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, కేథ‌రిన్ థెస్రా హీరోయిన్లుగా న‌టించారు. ఇక ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. రిలీజ్‌కు ముందే సురేష్‌బాబు స్ట్రాట‌జీతో భారీ లాభాలు మూట‌క‌ట్టుకుంది. రూ. 11 కోట్ల పెట్టుబ‌డితో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే రూ. 9 కోట్ల లాభాలు సొంతం చేసుకున్న‌ట్టు ట్రేడ్ టాక్‌.

తెలుగు శాటిలైట్స్ హక్కులకు 3 కోట్లు రాగా, హిందీ శాటిలైట్స్ హక్కులను రూ. 7 కోట్ల‌కు అమ్మారు. మ‌ళ‌యాళ్ శాటిలైట్ రైట్స్‌ను రూ 1.5 కోట్లు రాగా, హిందీ ఇంటర్ నెట్ 2.5 కోట్లు, తెలుగు ఇంటర్ నెట్‌కు 2.5 కోట్లు వచ్చాయని…. మొత్తం కలిపితే 19.5 కోట్లు వ‌చ్చాయంటున్నారు.

థియేట్రిక‌ల్ రైట్స్ కాకుండానే ఈ సినిమాకు రూ. 9 కోట్ల లాభాలు వ‌చ్చాయి. ఇక సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతో సురేష్‌బాబు ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ అమ్మ‌కుండా నాలుగు రాష్ట్రాల్లోను సొంతంగా విడుద‌ల చేస్తున్నారు. ఎలాగూ రూ. 9 కోట్ల లాభం రావ‌డంతో సురేష్‌బాబు ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసేందుకు రిస్క్ చేస్తున్నారు.