టీడీపీలో చిన రాజ‌ప్ప కుల క‌ల‌క‌లం…చంద్ర‌బాబు ఫైన‌ల్ వార్నింగ్‌

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల వేల టీడీపీలో కుల క‌ల‌క‌లం రేగింది. టీడీపీకి బ‌ల‌మైన వెన్నుద‌న్నుగా ఉండే ఓ ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గంపై డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప చేసిన వ్యాఖ్య‌లు చినికిచినికి గాలివాన‌లా మారిన‌ట్టు తెలుస్తోంది. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను సీఎం చంద్ర‌బాబు చిన‌రాజ‌ప్ప‌కు అప్ప‌గించారు. అయితే అక్క‌డ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో చిన‌రాజ‌ప్ప‌పై చాలా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అక్క‌డ కొంత‌మంది త‌న అనుచ‌రులైన వీక్ క్యాండెట్ల‌కు ఆయ‌న టిక్కెట్లు కేటాయించార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక కాకినాడ కార్పొరేష‌న్‌లో టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉండే ఓ ప్ర‌ధాన సామాజిక‌వర్గానికి ఒక్క కార్పొరేట‌ర్ సీటు కూడా ఇవ్వ‌లేదు. విప‌క్ష వైసీపీ అయినా ఓ సీటు కేటాయించినా, టీడీపీకి బ‌లంగా ఉండే ఆ సామాజిక‌వ‌ర్గానికి టీడీపీ ఒక్క సీటు కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ సామాజిక‌వ‌ర్గంలో కాస్త అసంతృప్తి చెల‌రేగింది.

అంత‌టితో ఆగ‌కుండా చిన‌రాజ‌ప్ప ఆ క్యాస్ట్ వాళ్లు టీడీపీకి ఎందుకు ఓట్లు వేయ‌రు… ఒక్క సీటు కూడా ఇవ్వ‌మ‌ని తీవ్ర ప‌ద‌జాలం వాడిన‌ట్టు స‌మాచారం. దీంతో ఆ సామాజిక‌వ‌ర్గ పెద్ద‌లు కొన్ని వార్డుల్లో రెబ‌ల్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న చంద్ర‌బాబు చిన‌రాజ‌ప్ప‌కు ఫోన్ చేసి ఫోన్‌లో ఫైనల్ వార్నింగ్ అంటూ క్లాస్ పీక‌డంతో పాటు ఆయ‌న్ను కాకినాడ ఎన్నిక‌ల బాధ్య‌తల నుంచి త‌ప్పించి ఆ బాధ్యతలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అప్పగించారు.

మొత్తం 48 డివిజ‌న్ల‌లో బీజేపీకి 9 పోను మిగిలిన డివిజ‌న్ల‌ను టీడీపీ తీసుకుంది. ఇక్క‌డ ఒక్క వార్డు కూడా టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉండే సామాజిక‌వ‌ర్గానికి ఇవ్వ‌లేదు. అంత‌టితో ఆగ‌కుండా చినరాజప్ప ఆ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని స‌ద‌రు సామాజిక వ‌ర్గ పెద్ద‌లు చంద్ర‌బాబు దృష్టికి తీసుకువెళ్ల‌డంతో ఆయ‌న రాజ‌ప్ప‌కు వార్నింగ్ ఇవ్వ‌డంతో పాటు ఆయ‌న్ను కాకినాడ ఇన్‌చార్జ్‌గా త‌ప్పించి వెంట‌నే ఆ బాధ్య‌త‌ల‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అప్పగించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.