ఉప‌రాష్ట్ర ప‌తిగా వెంక‌య్య‌…ఏపీ ప‌రిస్థితి ఏంటి!

నెల్లూరుకు చెందిన బీజేపీ మోస్ట్ సీనియ‌ర్ నేత‌, కేంద్రంలో మంత్రిగా ఉన్న ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు త్వ‌ర‌లోనే దేశ ఉప రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నార‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌రో కొద్ది రోజుల్లో ఉప‌రాష్ట్ర ప‌తి ఎన్నిక‌లూ జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ ప‌క్షాన ఎన్డీయే ఉప‌రాష్ట్ర ప‌తి అభ్య‌ర్థిగా వెంక‌య్య‌ను నిల‌బెట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. రాజ్య స‌భ‌ను న‌డిపించేది ఉప‌రాష్ట్ర‌ప‌తే కాబ‌ట్టి.. త‌మ ప‌క్షాన గ‌ట్టి అభ్య‌ర్థి ఉండ‌డం అవ‌స‌ర‌మ‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్న నేప‌థ్యంలో వెంక‌య్య‌కు ఈ ఛాన్స్ వ‌చ్చింద‌ని అంటున్నారు.

దీంతో పాటు వెంక‌య్య‌ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పించాల‌ని మోడీ కూడా ఎప్ప‌టి నుంచో ప్లాన్ చేస్తున్నారు. వెంక‌య్య వ‌ల్ల త‌న‌కు ద‌క్షిణాదిలో ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని భావిస్తోన్న మోడీ ఆయ‌న్ను గతంలోనే గ‌వ‌ర్న‌ర్‌గా పంపాల‌ని ప్లాన్ వేసి ఫెయిల్ అయ్యారు. ఇక తాజాగా ఆయ‌న్ను ఉప రాష్ట్ర‌ప‌తిగా పంప‌డం మోడీ అండ్ కోకి క‌లిసొచ్చే అంశ‌మే అయిన‌ప్ప‌టికీ.. ఏపీలో చంద్ర‌బాబుకు మాత్రం వెంక‌య్య‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా పంపితే మాత్రంక ష్టాలు మొద‌లైన‌ట్టే!!

విభ‌జ‌న‌తో రాజ‌ధాని స‌హా ఆస్తుల‌ను పోగొట్టుకున్న ఏపీ.. పూర్తిగా కేంద్రంపైనే ఆధార‌ప‌డుతోంది. కేంద్రం ఇస్తున్న వ‌న‌రుల‌తోనే పోల‌వ‌రం, రాజ‌ధాని, ఐఐటీలు, ఐఐఎంలు వంటివి నిర్మిస్తోంది. నిధులు రాబ‌ట్టడం వెనుక కేంద్రంలో ఏపీ త‌ర‌ఫున బ‌లంగా మాట్లాడింది వెంక‌య్య‌నాయుడు మాత్ర‌మే. అంద‌రు మంత్రుల‌ను స‌మ‌న్వ‌య ప‌రిచి.. రాష్ట్రానికి నిధులు ఇప్పించ‌డం స‌హా ప్యాకేజీలోనూ ఆయ‌న త‌న రాష్ట్ర అభివృద్ధికి పావులు క‌దిపారు.

ఈ ప‌రిణామం చంద్ర‌బాబుకు ఎంతో క‌లిసొచ్చింది. ఏ స‌మస్య వ‌చ్చినా వెంక‌య్య‌ను క‌లిసి చెప్పుకొనేవారు . ఇక, ఇప్పుడు వెంక‌య్య ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోతే.. ఏపీ గురించి ప‌ట్టించుకునే ప‌రిస్థితి కేంద్రంలో ఎవ‌రికీ లేద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో రాబోయే ఎన్నిక‌ల సీజ‌న్ నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ముందుకు తీసుకువెళ్లాల‌ని భావిస్తున్న చంద్ర‌బాబుకు ఈ ప‌రిణామంమింగుడు ప‌డ‌డం లేదు. వెంక‌య్య కేంద్రంలో లేక‌పోతే ఏపీ ప‌రిస్థితి ఏంట‌ని ఆయ‌న త‌ల ప‌ట్టుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి