అలా చేస్తే జ‌గ‌న్ ఈ పాటికే సీఎం అయ్యేవాడా..!

వైఎస్‌.జ‌గ‌న్‌కు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ ఏంటా ? అని షాక్ అవుతాం. అయితే ఇది నిజ‌మే అట. జ‌గ‌న్ ప్ర‌స్తుతం ఏపీలో విప‌క్షంలో ఉండి సీఎం కుర్చీ ఎప్పుడు ఎక్కాలా అని వెయిట్ చేస్తున్నాడు. మ‌రి జ‌గ‌న్‌కు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేయ‌డం ఏంటా ? అన్న సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 2010లో హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో అప్పుడు జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌న్న డిమాండ్లు కొంద‌రు ఎమ్మెల్యేల నుంచి వినిపించాయి.

2009 ఎన్నిక‌ల్లో తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన జ‌గ‌న్ క‌డ‌ప నుంచి ఎంపీగా గెలిచారు. ఇక 2010లో వైఎస్ మృతి చెంద‌డంతో జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌ని కొంద‌రు ఎమ్మెల్యేలు కోర‌డం, అందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోక‌పోవ‌డం తెలిసిందే. వెంట‌నే జ‌గ‌న్‌ను కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి వైసీపీ స్థాపించి క‌డ‌ప ఉప ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిచి స‌త్తాచాటారు.

ఇక వైఎస్‌.మృతి త‌ర్వాత జ‌గ‌న్‌కు కాంగ్రెస్ అధిష్టానం మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసింద‌ట‌. జ‌గ‌న్‌కు స్టేట్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి లేదా కేంద్రంలో స‌హాయ మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పింద‌ట‌. అయితే జ‌గ‌న్ మాత్రం ఈ ఆఫ‌ర్‌ను రిజెక్ట్ చేశారు. ఈ విష‌యాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ ఆలీ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

నాడు కాంగ్రెస్ అధిష్టానం జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు త‌గిన అనుభ‌వం లేద‌ని డిసైడ్ అవ్వ‌డంతో ముందుగా మంత్రిని చేసి త‌ర్వాత సీఎం చేయాల‌ని అనుకుంద‌ట‌. ఇదే విష‌యాన్ని ష‌బ్బీర్ జ‌గ‌న్‌కు చెప్పినా ఆయ‌న మాత్రం ఈ ప్ర‌తిపాద‌న‌ను రిజెక్ట్ చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

కాంగ్రెస్ అధిష్టానం త‌న‌ను ఓ బ‌చ్చాగా చూస్తోంద‌ని… తాను ఏంటో ఇప్ప‌టికే సాక్షి పేప‌ర్‌తో ఫ్రూవ్ చేసుకున్నాన‌ని, త‌న‌కు చాలా అనుభ‌వం ఉంద‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇక మూడేళ్లు ఓపిక ప‌డితే 30 ఏళ్లు సీఎంగా ఉంటావ‌ని జ‌గ‌న్‌కు చెప్పినా త‌న మాట విన‌లేద‌ని చెప్పిన‌ట్టు ష‌బ్బీర్ తెలిపారు. మ‌రి జ‌గ‌న్‌ నాడు ష‌బ్బీర్‌ చెప్పిన‌ట్టు వింటే ఏపీలో కాంగ్రెస్‌కు ఈ దుస్థితి ఉండేది కాదేమో… ఇక జ‌గ‌న్ సీఎం అయ్యి ఉండేవాడేమో..!