సునీత ప్ర‌య‌త్నాలకు బాబు బ్రేక్

చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రి ప‌రిటాల సునీత ప్రాబ‌ల్యం రోజు రోజుకు త‌గ్గుతుంద‌న్న సందేహాలు క‌లుగుతున్నాయి. తెలుగు ప్ర‌జ‌లు, తెలుగుదేశం అభిమానుల్లో ప‌రిటాల పేరు చెపితే ర‌క్తం ఉడిగిపోయి, పూన‌కాలు వ‌చ్చేసేవాళ్లు చాలా మందే ఉంటారు. ప‌రిటాల ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ క్ర‌మంలోనే వ‌రుస‌గా మూడుసార్లు గెలిచిన సునీత‌ను గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత చంద్ర‌బాబు కీల‌క‌మైన పౌర‌స‌ర‌ప‌రాల శాఖా మంత్రిని చేశారు. ప్ర‌క్షాళ‌న‌లో ఆమె ప్ర‌యారిటీ త‌గ్గించిన చంద్ర‌బాబు ఇప్పుడు అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లోను ఆమె మాట‌ను ప‌క్క‌న పెట్టారు.

అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే అనంత‌పురం జ‌డ్పీ చైర్మ‌న్ పీఠాన్ని మూడేళ్ల క్రితం ప‌రిటాల ర‌వి అనుచ‌రుడు చ‌మ‌న్‌కు ఇచ్చారు. 2004లో కాంగ్రెస్ పాల‌న స్టార్ట్ అవ్వ‌డం, ర‌వి హత్య త‌ర్వాత చ‌మ‌న్ క‌ర్ణాట‌క‌కు వెళ్లి అక్క‌డ అండ‌ర్‌గ్రౌండ్‌లో ఉన్నాడు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఇక్క‌డ‌కు వ‌చ్చిన చ‌మ‌న్ జ‌డ్పీటీసీగా గెలిచి జ‌డ్పీచైర్మ‌న్ అయ్యాడు. చ‌మ‌న్‌ను జ‌డ్పీ చైర్మ‌న్ చేయడంలో మంత్రి సునీత మాట నెగ్గించుకున్నారు. ఇందుకు బాల‌య్య అండ‌దంలు కూడా ఉండి ఉంటాయి.

అజ్ఞాతంలో ఉన్న వ్య‌క్తికి జ‌డ్పీచైర్మ‌న్ ఇస్తే, ప‌దేళ్ల‌పాటు కాంగ్రెస్‌ను ఎదుర్కొని ఫైట్ చేసిన వారి ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న‌లు కూడా అప్ప‌ట్లోనే వ‌చ్చాయి. ఈ ప‌ద‌వికి చ‌మ‌న్‌తో పాటు పూల నాగ‌రాజు కూడా తీవ్ర‌స్థాయిలో పోటీప‌డ్డారు. అప్పుడు చ‌మ‌న్‌, నాగ‌రాజుకు చెరో రెండున్న‌రేళ్లు జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని అనుకున్నారు.

మూడేళ్ల త‌ర్వాత క‌ట్ చేస్తే చ‌మ‌న్‌నే ఐదేళ్ల‌పాటు కంటిన్యూ చేయాల‌ని సునీత ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. చివ‌ర‌కు ఈ పంచాయితీ చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరింది. ఆయ‌న సునీతకు షాక్ ఇస్తూ చ‌మ‌న్ త‌ప్పుకుని పూల నాగ‌రాజుకు జ‌డ్పీచైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని డెసిష‌న్ తీసుకున్నారు. దీంతో సునీత అవాక్క‌వ్వ‌గా, ఆమె వ‌ర్గం షాక్‌లో మునిగింది.