ఏపీలో ఓ ఛానెల్ – తెలంగాణ‌లో ఓ ఛానెల్ ఎంట్రీ

తెలుగు మీడియా రంగంలో ఉన్న‌న్ని ఛానెళ్లు దేశంలో జాతీయ మీడియాలో తప్పా ఏ స్టేట్‌లోను లేవు. తెలుగులో లెక్క‌కు మిక్కిలిగా మీడియా ఛానెల్స్ పుట్టుకొస్తున్నాయి. చాలా ఆర్భాటంగా స్టార్ట్ అవుతోన్న ఛానెల్స్‌లో కొన్ని మూత‌ప‌డుతుంటే కొన్ని ఛానెల్స్ మాత్రం నామ్ కే వాస్తేగా ఉన్నామంటే ఉన్నామ‌నిపించుకుంటున్నాయి. తెలుగులో ఎన్ని ఛానెల్స్ వ‌స్తున్నా కేవ‌లం టీవీ-9, ఎన్టీవీ, టీవీ-5, ఏబీన్‌, ఈటీవీ వీటితో పాటు ఒక‌టీ అరా ఛానెల్స్ మిన‌హా మిగిలిన ఛానెల్స్ ఏవీ సిబ్బందికి జీతాలు ఇచ్చే ప‌రిస్థితుల్లో కూడా లేవు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు మీడియాలో వ‌స్తోన్న రెండు కొత్త ఛానెల్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. గ‌తంలో వివిధ ఛానెల్స్‌లో ప‌నిచేసిన వెంక‌ట‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో ఏపీ టైమ్స్ వ‌స్తోంది. ఏపీ టైమ్స్ ఇప్ప‌టికే సిబ్బంది కావాలంటూ ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇస్తోంది. ఏపీ నుంచి వ‌చ్చే తొలి శాటిలైట్ ఛానెల్ అంటూ దీనిని ప్ర‌చారం చేసుకుంటున్నారు.

స్టేట్ డివైడ్ అయ్యాక కూడా ప్ర‌ధాన ఛానెళ్ల‌న్ని హైద‌రాబాద్ కేంద్రంగానే ప‌నిచేస్తూ విజ‌య‌వాడ‌లో చిన్న చిన్న స్టూడియోలు పెట్టి క‌థ న‌డిపించేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏపీ టైమ్స్ ఏపీ కేంద్రంగా వ‌స్తోదంటూ చేస్తోన్న హ‌డావిడి ఈ ఛానెల్ మీద కాస్త ఆస‌క్తి రేపుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియ‌ర్ లీడ‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా తాను పొలిటిక‌ల్‌గా హైప్ అయ్యేందుకు ఓ ఛానెల్ చేతిలో ఉంటే బెట‌ర్ అనుకుంటున్నార‌ట‌.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ్ టీవీ పునః ప్రారంభించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే రాజ్ టీవీలో పైస్థాయిలో హెడ్‌తో పాటు మిగిలిన వారి నియామ‌కాలు మొద‌లెట్టేశారు. మ‌రి తెలుగు మీడియాలో ఎంట్రీ ఇస్తోన్న ఈ రెండు కొత్త ఛానెల్స్ త్వ‌ర‌లోనే త‌మ ప్ర‌సారాలు స్టార్ట్ చేయ‌నున్నాయి. మ‌రి ఇవి గ‌తంలో చాలా ఛానెల్స్ లాగానే త్వ‌ర‌లోనే తెర‌వెన‌క్కి వెళ్లిపోతాయా ? లేదా ? ఈ ట‌ఫ్ ఫైట్లో స‌త్తా చాటాతాయా ? అన్న‌ది చూడాలి.