సూపర్ స్టార్ మహేష్ బాబు – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్. మురగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న స్పైడర్ బిజినెస్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ముందుగా ఏపీలోని పశ్చిమగోదావరి రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.
స్పైడర్ వెస్ట్ గోదావరి రైట్స్‌ను ఎల్వీఆర్ ఫిలింస్ సంస్థ రూ 5.04 కోట్లకు సొంతం చేసుకుంది. ఇదే జిల్లాలో ఖైదీ నెంబర్ 150 సినిమాను 4.6 కోట్లకు, బాహుబలి – ది బిగినింగ్‌ను 4.5 కోట్లకు అమ్మారు. ఈ రెండు సినిమాల కంటే రూ.50 లక్షలకు అదనంగా స్పైడర్ రైట్స్ అమ్ముడుపోయాయి.
ఇక స్పైడర్ విశాఖ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ రూ. 8 కోట్లకు కాస్త అటూ ఇటూగా భేరసారాలు జరుగుతున్నట్టు వినికిడి. మహేష్ సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తోన్న ఈ సినిమాలకు హరీశ్ జైరాజ్ స్వరాలందిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.120 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా. మహేష్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.