పొలిటికల్ పంచ్ కి బ్రేకులు

సోషల్  మీడియా వైరల్ గా మారిన పొలిటికల్ పంచ్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈ పొలిటికల్ పంచ్ టీడీపీనే ద్యేయంగా చేసుకొని కార్టూన్స్ మరియు బాషా పదజాలం వాడుతూ పోస్ట్లు పెడుతుంటారు. అవి చూస్తానికి వేరే పార్టీ వర్గానికి ఆనందం కలిగించవచ్చు కానీ ఆ నాయకులని అవి కొంత మేర ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ మధ్య మంత్రి గా ప్రయాణం మొదలుపెట్టిన లోకేష్ ఈ విషయంలో చాలా కోపం గా ఉన్నారు స్వయానా ఆయన ప్రత్యక్షంగా సోషల్ మీడియా లో చేస్తున్న ఈ వికృత చేష్టలు ఆపకపోతే పోలీసులకు పిర్యాదు చేయాల్సి వస్తుంది ఫైర్ అయ్యారు. ఈ పొలిటికల్ పంచ్ అనే పేజీ వైస్సార్సీపీ కి చెందిన అనధికార ప్రమోషన్ చేసే ప్రచారం గా వినికిడి. ప్రతి పనికి కొన్ని హద్దులు ఉంటాయి కానీ ఆ హద్దులు దాటకుండా ఎన్ని చిందులు వేసిన పర్లేదు, ఆ హద్దులు దాటితే ఎలా ఉంటదో ఉదాహరణ ఇదే.

ఈ పేజీ మేనేజ్ చేస్తున్న ఇంటూరి రవి కిరణ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పెద్దల సభను కించపరుస్తూ కార్టూన్‌ వేయడంతో అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు పై తుల్లూరు పోలీస్ స్టేషన్ ఇప్పటికే కేసు నడ్డి చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ నేతలమంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. చట్ట సభలను కించపరిస్తే ఎవరిపై నైనా చర్య తీసుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌, మంత్రులను కించపరుస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.