ప‌వ‌న్ బాధితుల బాధ‌లు చూడండి

ప్ర‌ముఖ సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ప్పు చేసిన వారిని నిల‌దీసేందుకు…వారిని ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాన‌ని ప‌దే ప‌దే చెపుతుంటాడు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఏపీలో ఇప్ప‌టికే ప‌లు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోన్న బాధితుల ప‌క్షాన పోరాడుతున్నాడు. వివిధ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఏ స‌మ‌స్య‌ల‌తో అయితే బాధ‌ప‌డుతున్నారో ? అక్క‌డ‌కు వెళ్లి వారి ప‌క్షాన తాను పోరాటం చేస్తాన‌ని..ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాన‌ని…వారికి అండ‌గా ఉంటాన‌ని చెప్పారు.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది..ఇప్పుడు ప‌వ‌న్ సినిమా వ‌ల్ల త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని..ఈ విష‌యంలో ప‌వ‌న్ త‌మ‌కు న్యాయం చేయాలంటూ ప‌వ‌న్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా బాధితులు రోడ్డెక్కారు. ప‌వ‌న్ కార‌ణంగా తాము న‌ష్ట‌పోయామ‌ని..త‌మ‌ను ప‌వ‌నే ఆదుకోవాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం వారు ఏకంగా రోడ్డుమీద టెంట్ వేసి… ప‌వ‌న్ ఫొటోలు పెట్టుకుని..త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి మ‌రీ దీక్ష చేస్తున్నారు.

ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చివ‌రి చిత్రం స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌. గ‌తేడాది ఏప్రిల్‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా దారుణంగా డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు నిండా మునిగారు. అయితే వారికి ప‌వ‌న్ త‌దుప‌రి చిత్రం రైట్స్ ఇస్తాన‌ని నిర్మాత శ‌ర్‌త‌మ‌రార్ న‌చ్చ‌చెప్పారు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ తాజా చిత్రాన్ని సైతం శ‌ర‌త్ మ‌రారే నిర్మిస్తున్నాడు. కానీ ఆయ‌న మాట త‌ప్పి కాట‌మ‌రాయుడు సినిమాను కొత్త బ‌య్య‌ర్ల‌కు ఇచ్చేశార‌ని వారు మండిప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలోనే స‌ర్దార్ కృష్ణా జిల్లా రైట్స్ కొని న‌ష్టపోయిన డిస్ట్రిబ్యూట‌ర్ సంప‌త్‌కుమార్ తాను రూ.2 కోట్లు న‌ష్ట‌పోయాయ‌ని మీడియా ముందుకు వ‌చ్చి సంచ‌ల‌నం రేపారు. తాజాగా స‌ర్దార్ మ‌రో ఐదారు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానున్న వేళ ఆయ‌న ఫిల్మ్ చాంబ‌ర్ వ‌ద్ద రోడ్డు మీద టెంట్ వేసి మ‌రీ నిరాహార దీక్ష‌కు దిగారు. మీరే మా దేవుడు అంటున్నా ప‌ట్టించుకోని ప‌వ‌న్‌, మోసం చేసిన త‌ప్పించుకుని తిరుగుతున్న శ‌ర‌త్‌మ‌రార్‌, ప‌వ‌న్ మేనేజ‌ర్ శ్రీనివాస్ అంటూ ఫ్లెక్సీలు కూడా క‌ట్టారు. మ‌రి అంద‌రి బాధ‌లు ప‌ట్టించుకుంటున్న ప‌వ‌న్ త‌న సినిమా బాధితుల‌కు ఎలాంటి న్యాయం చేస్తాడో చూడాలి.