కుప్పం బ‌రిలో లోకేశ్ – గుడివాడ నుంచి చంద్ర‌బాబు

ఏపీలో కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ఏప్రిల్ 2 ముహూర్తంగా ఖ‌రారైంది. దీంతో లోకేశ్ ఎప్పుడెప్పుడు మంత్రి అవుతారా ? అని ఎంతో ఉత్కంఠ‌గా వెయిట్ చూస్తోన్న వారి నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. లోకేశ్‌కే ఏయేశాఖ‌లు ద‌క్కుతాయా ? అన్న‌ది ఒక్క‌టి మాత్ర‌మే మిగిలిఉంది. ఇదిలా ఉంటే లోకేశ్ మంత్రిగా మ‌రో రెండేళ్లు మాత్ర‌మే ఉంటారు. ఇంకా చెప్పాలంటే యేడాదిన్న‌ర టైం మాత్ర‌మే వాళ్ల‌కు ఫ్రీగా ఉంటుంది. చివ‌రి ఆరు నెల‌లు మ‌ళ్లీ ఎన్నిక‌ల మూడ్‌కు రెడీ అవ్వాల్సి ఉంటుంది.

ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేశ్ 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ఎమ్మెల్యేగా బ‌రిలో ఉండ‌క తప్ప‌ద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. 2019లో కూడా లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీచేయ‌క‌పోతే అత‌డి రాజ‌కీయ స‌మ‌ర్థ‌త‌పై అనేక డౌట్లు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌ల్లో లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌న్న టాక్ న‌డుస్తోంది.

ఇక లోకేశ్ 2019లో చిత్తూరు జిల్లాలో త‌న తండ్రి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. చంద్ర‌బాబు సైతం త‌న‌యుడి కోసం కుప్పంను త్యాగం చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. లోకేశ్‌కు తిరుగులేకుండా ఉండేందుకు కుప్పంను వ‌దులుకుంటే చంద్ర‌బాబు ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డ‌, గ‌తంలో ఆయ‌న ప్రాథినిత్యం వ‌హించిన కృష్ణా జిల్లా గుడివాడ లేదా చిత్తూరులోని సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరిల‌లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం ఎంచుకుంటార‌ని తెలుస్తోంది.

చంద్ర‌బాబు గుడివాడ బ‌రిలో ఉంటే ఆ ఎఫెక్ట్ కృష్ణా, గుంటూరు జిల్లాల‌పై బ‌లంగా ఉండ‌డంతో పాటు ఈ రెండు జిల్లాల్లో టీడీపీ ప‌వ‌నాలు మ‌రింత గ‌ట్టిగా వీస్తాయ‌ని రాజ‌ధాని టీడీపీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.