ఖైదీ-శాత‌క‌ర్ణి-శ‌త‌మానం వ‌సూళ్ల లెక్క‌లివే

ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సీజన్‌కు టాలీవుడ్ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి, ఈ మూడు సినిమాల‌తో పాటు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి హెడ్‌కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య ఈ నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వీటిలో ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి సినిమాకు మిన‌హా మిగిలిన మూడు సినిమాల‌కు ఓ రేంజ్‌లో క‌లెక్ష‌న్లు కురుస్తున్నాయి.

తెలుగు సినిమా మార్కెట్‌కు కీల‌కంగా మారిన ఓవ‌ర్సీస్‌లో ఈ మూడు సినిమాలు భారీ వ‌సూళ్లు సాధిస్తూ సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్నాయి. అక్క‌డ ఫ‌స్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేస‌రికి ఈ మూడు సినిమాలూ దాదాపుగా లాభాల బాట పట్టినట్లు ట్రేడ్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు క‌లిపి ఫ‌స్ట్ వీకెంట్ కంప్లీట్ అయ్యే స‌రికి అక్క‌డ 3.75 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టాయి.

మంగ‌ళ‌వారంతో స్టార్ట్ అయిన ఖైదీ నెంబ‌ర్ 150 ఇప్ప‌టికే అక్క‌డ 2.09 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు (ఇండియ‌న్ క‌రెన్సీలో రూ 14.29 కోట్లు) కొల్ల‌గొట్టింది. బుధ‌వారం వ‌చ్చిన బాల‌య్య శాత‌క‌ర్ణి 1.25 మిలియ‌న్ డాల‌ర్లు ( రూ 8.75 కోట్లు ) రాబ‌ట్టింది.

ఈ రెండు సినిమాలు ఆయా హీరోల కేరీర్‌లోనే ఓవర్సీస్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాలుగా రికార్డుల‌కు ఎక్కాయి.

ఇక రెండు పెద్ద సినిమాల మ‌ధ్య రిలీజ్ అయిన శ‌త‌మానం భ‌వ‌తి సైతం అక్క‌డ ఇప్ప‌టికే 411 కే డాల‌ర్లు ( రూ 2.80 కోట్లు) సాధించింది. ఇక వీకెండ్ కంప్లీట్ అవ్వ‌డంతో సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయ్యే వ‌ర‌కు ఈ సినిమాలు ఏ స్థాయిలో స్టడీగా వ‌సూళ్లు సాధిస్తాయో చూడాలి.