‘బోస్‌’ – ఇది ఓ దేశభక్తుడి కథ.

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మించే చిత్రానికి ‘బోస్‌’ అనే టైటిల్‌ పెట్టబోతున్నారని టాక్‌ వినవస్తోంది. అయితే ఇంతవరకు ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది తెలియరాలేదు. పలువురు దర్శకులతో దర్శకరత్న దాసరి నారాయణరావు సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే దర్శకుడి విషయంలో స్పష్టత ఇస్తారట. ఈలోగా టైటిల్‌ని దాసరి నారాయణరావు తన తారక ప్రభు ఫిలింస్‌ పతాకంపై ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేసినట్లు తెలియవస్తోంది.

ఈ చిత్ర కథకు సంబంధించి ముఖ్యమైన పాయింట్‌ని దాసరి నారాయణరావే ప్రిపేర్‌ చేశారని సమాచారమ్‌. బోస్‌ అంటే పరిచయం కొత్తగా అవసరం లేదు భారతీయులకి. స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్‌ హింద్‌ పౌజు దళపతి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంటే యువతరానికి ఓ స్ఫూర్తి. ఆయన పేరు చెబితే యువరక్తం ఉప్పొంగుతుంది దేశభక్తితో. బోస్‌లోని పేట్రియాటిజంని పవన్‌కళ్యాణ్‌ ద్వారా చూపబోతున్నారట.

 ప్రస్తుత రాజకీయాలపై ఈ చిత్రం ఓ పవర్‌ఫుల్‌ అస్త్రంగా ఉండబోతోందని టాక్‌. అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా పవన్‌కళ్యాణ్‌తో రూపొందించే చిత్రం ఉంటుందని ఇదివరకు దాసరి చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుత రాజకీయాలు – పవన్‌కళ్యాణ్‌ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని దాసరి, దేశభక్తి ప్రధానంగా రాజకీయ అస్త్రం ‘బోస్‌’ పేరుత ప్రయోగించబోతున్నారని సమాచారమ్‌.