అడల్డ్‌ కామెడీలో శ్రీముఖి!

ఈమధ్యకాలంలో బుల్లితెర యాంకర్లుగా పాపులర్‌ అయి వెండితెర మీద కూడా సంచలనం సృష్టిస్తున్నారు ఆకోవాలో రష్మీ,అనసూయ ముందువరుసలో వుంటారు. ముఖ్యంగా రష్మీ అయితే ‘సన్నీలియోన్‌ ఆఫ్‌ సౌత్‌’ అని పిలిపించుకోవడానికి కూడా రెడీ అయిపోయింది. టీవీ షోస్ తో సంచలనం సృష్టిస్తున్న వీరిద్దరూ వెండితెర మీద కూడా మెరిసిపోవడానికి అప్పుడప్పుడు హాట్‌ హాట్‌ ఫోటోషూట్‌లతో రెచ్చిపోతున్నారు.

ఇప్పుడు యాంకర్ శ్రీముఖి కూడా వీరి బాటలోనే నడుస్తున్నట్టుంది. ఈమె కూడా ప్రస్తుతం బుల్లితెర షోస్ తో చాలా బిజీగా ఉంది. ఈమధ్యకాలంలో వచ్చిన నాని ‘జెంటిల్మెన్‌’ సినిమాలో నటించింది. అయితే అది ఆమెకు పెద్ద బ్రేక్‌ ఇవ్వలేదు. అందుకే శ్రీముఖి కూడా ఫోటోషూట్‌లో పాల్గొని తన హాట్‌ ఫోటోలని ఇంటర్‌నెట్‌లోకి వదిలింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో తీసిన ఆ ఫోటోలను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

ప్రస్తుతానికి శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాకుండా అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న ‘హంటర్‌’ అనే అడల్డ్‌ కామెడీలో శ్రీముఖి నటిస్తోందన్న వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఈ ఫోటోషూట్‌తో మరిన్ని సినిమా అవకాశాలను కొట్టేయాలని చూస్తుంది ఈ హాట్ యాంకర్.