ఎన్టీఆర్ స్టామినా 300 కోట్లా!

గ‌తేడాది టెంప‌ర్ సినిమా ముందు వ‌ర‌కు కూడా ఎన్టీఆర్ తోటి హీరోలు రూ.40-50 కోట్ల మార్క్‌ను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటుంటే మ‌నోడు మాత్రం రూ.40 కోట్ల షేర్ మార్క్‌ను ట‌చ్ చేసేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డేవాడు. య‌మ‌దొంగ త‌ర్వాత ఎన్టీఆర్‌కు ఆ స్థాయి హిట్ ప‌డ‌లేదు. మ‌ధ్య‌లో యావ‌రేజ్‌లు, డిజాస్ట‌ర్లే వ‌చ్చాయి. టెంప‌ర్‌తో ఫ‌స్ట్ టైం రూ.40 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ఎన్టీఆర్ వెను వెంట‌నే నాన్న‌కు ప్రేమ‌తో సినిమాతో రూ.50 కోట్ల క్ల‌బ్‌లోకి వ‌చ్చేశాడు.

అంత‌టితో ఆగ‌కుండా తాజా చిత్రం గ్యారేజ్‌తో ఏకంగా రూ.120 కోట్ల గ్రాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్ప‌టికే రూ.80 కోట్ల షేర్‌కు చేరువ‌య్యాడు. ఇక ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమ‌తో సినిమాతో రూ.90 కోట్ల గ్రాస్‌, గ్యారేజ్‌తో ఇప్ప‌టికే రూ.125 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఎన్టీఆర్ టోట‌ల్‌గా రూ.215 కోట్లు సాధించాడు. గ్యారేజ్ ఇంకా ఫుల్ ర‌న్‌లో మరికొన్ని కోట్లు సాధించ‌నుంది.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఎన్టీఆర్ మార్కెట్ రూ.215 కోట్లు అని ఇప్ప‌టి వ‌ర‌కు లెక్క తేలింది. అయితే ఈ రెండు సినిమాల‌కు ముందు డివైడ్ టాక్ వ‌చ్చింది. దీనిని బ‌ట్టి ఎన్టీఆర్ ఒకే యేడాదిలో న‌టించిన రెండు సినిమాల‌కు యునానిమ‌స్ హిట్ టాక్ వ‌స్తే ఒక్కో సినిమా సులువుగానే రూ.150 కోట్లు కొల్ల‌గొడుతుంద‌నుకోవ‌చ్చు. అంటే ఓకే యేడాదిలో ఎన్టీఆర్ రెండు సూప‌ర్ హిట్ సినిమాల‌తో వ‌స్తే రూ.300 కోట్లు కొల్ల‌గొట్ట‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు.