దమ్ముంటే రా ఇప్పుడే రాజీనామా చేస్తా:కెసిఆర్

మహా రాష్ట్ర సర్కార్ తో గోదావరి జలాలపై ఒప్పందాన్ని చారిత్రాత్మక ఒప్పందామంటూ ఆకాశానికెత్తేసిన కెసిఆర్ ఆ విజయం తో ఈ రోజు నగరానికి తిరిగి వచ్చిన సందర్బంగా కెసిఆర్ కి ఘన స్వాగతం లభించింది.

వచ్చి రావడం తోనే నిన్న కాంగ్రెస్ నాయకులు చేసిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పైన కెసిఆర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.ప్రజలంతా ఈ ఒప్పందం పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే ఈ కాంగ్రెస్ సన్నాసులు మాత్రం ఓర్వలేక నల్ల జెండాలు ప్రదర్శితున్నారు అన్నారు.

నిన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ ఒంటి కాలిపై లేచాడు.నిజంగా ఉత్తమకుమార్ చెప్పినట్టు తుమ్మిడిహెట్టిపై గతం లో 152 అడుగులకు ఒప్పందం జరిగింది నిజమే అయితే రా..నీకు దమ్ముంటే ఆ ఒప్పంద కాగితాన్ని తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కు రా.నేను ఇంకో 40 నిమిషాలు బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే వుంటా..నువ్వు నిజంగా ఒప్పంద పత్రం తెస్తే ఇటునుండి ఇటే రాజభవన్ వెళ్లి గవర్నర్ కి రాజీనామా పత్రం సమర్పిస్తా..రాజకీయాలనుండి తప్పుకుంటా అని సవాల్ విసిరాడు. సిగ్గుమాలిన ఆరోపాను..నీతి లేని రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తోందని కెసిఆర్ కడిగిపారేశారు.