1st డే తమిళ్ 100 కోట్లు మొత్తం 250 కోట్లా?

రజినీకాంత్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే బ్రహ్మాండంగా జరిగిన మాట వాస్తవమే.రిలీజ్ కి ముందు ఇంతక ముందెన్నడూ ఏ సినిమాకి రాని హైప్ సూపర్ స్టార్ సినిమాకి వచ్చింది.ఇంకేముంది కలెక్షన్స్ పంట పండుతుందని అందరు ముందుగానే ఊహించారు.

అయితే మొదిటి షో అయ్యే సరికే టాక్ బయటొచ్చేసింది.కొందరు డిజాస్టర్ అంటుంటే ఇంకొందరు పర్లేదని సరిపెడుతున్నారు తప్ప సినిమా సూపర్ అని అన్న నాధుడే లేదన్నది నిర్వివాదాంశం.ఇలాంటి తరుణం లో నిర్మాత చెప్తున్న కలెక్షన్ లెక్కలు కళ్ళు తిరిగేలా వున్నాయి.కబాలి’ తొలి రోజే రూ. 250 కోట్లను వసూలు చేసిందని చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను తెలియజేశారు. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే రూ. 100 కోట్లు వసూలైనాయని, మిగతా అన్ని చోట్ల నుంచి రూ. 150 కోట్లు వచ్చిందని ఆయన వెల్లడించారు.

రజినీకాంత్ కి ఒక్క మన దేశం లోనే కాక ప్రపంచంలోని అనేక దేశాల్లో విపరీతమైన క్రేజ్ వున్నా సంగతి తెలిసిందే.దాని వల్ల యూకే, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, స్విట్ల ర్లాండ్, డెన్మార్క్, హాలెండ్, స్వీడన్, సౌతాఫ్రికా, నైజీరియా, మలేషియా, తదితర దేశాల్లో మంచి ఓపెనింగ్ వచ్చునంటాయనుకుందాం. అయినా సరే ఒక్క రోజులో డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాకి 250 కోట్లా అన్నది నమ్మశక్యంగా లేదన్నది సగటు ప్రేక్షకుడి వాదన.

అయితే అప్పుడే నిర్మాతలు పోస్ట్ రిలీజ్ ప్రచారానికి తెర లేపారు.కబాలి సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయిందట అందుకని కబాలి సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నామని ప్రకటించారు.అయినా ఈ మధ్య చిన్న పెద్ద హీరోలు అనే తేడా లేకుండా సినిమా రిలీజ్ అయింది మొదలు విజయ యాత్రలు,సక్సెస్ మీట్ లు,సీక్వెల్‌ లు ,అన్ని కోట్లు ఇన్ని కోట్లు కలెక్షన్స్ అంటూ సగటు ప్రేక్షకుడ్ని ఊరించి సినిమాకి రప్పించడం పబ్లిసిటీ లో భాగమయిపోయింది.ఫైనల్ గా బలయ్యేది మాత్రం ప్రేక్షకుడే..